సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి సోమవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా నందమూరి కుటుంబ సభ్యులు షాక్ కి గురయ్యారు.ఇలా నందమూరి కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడంతో గతంలో ఈ కుటుంబంలో జరిగిన సంఘటనలు గురించి ఆరాతీస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఎన్టీఆర్ కుటుంబానికి అలాగే అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల కలిసి రాలేదని ఈనెల ఈ కుటుంబానికి ఒక శాపంలా మారిందని పలువురు వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఎన్టీఆర్ కుటుంబ విషయానికి వస్తే ఎన్టీఆర్ నాలుగవ కుమారుడు హరికృష్ణ గత మూడు సంవత్సరాల క్రితం ఆగస్టు నెలలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. అదేవిధంగా హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఇకపోతే ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి సైతం ఆగస్టు నెలలోనే ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం అందరిని విషాదంలోకి నెట్టివేసింది.ఇకపోతే ఎన్టీఆర్ కుటుంబంలో ఈ మరణాలు మాత్రమే కాకుండా ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా ఆగస్టు నెలలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.
ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత రెండు సార్లు ముఖ్యమంత్రి పదవికి ఆగస్టు నెలలోనే తిరస్కరింపబడ్డారు. ఇలా ఆగస్టు నెలలోనే రెండుసార్లు ముఖ్యమంత్రి పదవిని కోల్పోవడం గమనార్హం. అదేవిధంగా 1995 ఆగస్టు సంక్షోభంలో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. ఆ సమయంలో జరిగిన వైస్రాయ్ స్కెచ్ కు ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కాలేకపోయారు.ఎన్టీఆర్ కుటుంబానికి ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఆగస్టు నెల పూర్తిగా శాపంగా మారిందని ఈనెల ఎన్టీఆర్ కుటుంబానికి కలిసి రాలేదని అభిమానులు భావిస్తున్నారు.