బిగ్ బాస్ ఆగస్టులో ఉన్నట్టా? లేదా… ఎలాంటి అప్డేట్ లేదేంటి?

ఎక్కడో ఇతర దేశాలలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమాన్ని మనదేశంలో అన్ని భాషలలో ప్రసారం అవుతూ విపరీతమైన ఆదరణ సంపాదించుకుంది. ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఐదు సీజన్లను పూర్తి చేసుకోవడమే కాకుండా ఒక నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తి చేసుకుంది. అయితే త్వరలోనే ఈ కార్యక్రమం సీజన్ సిక్స్ కూడా ప్రారంభం కాబోతుందనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ రోజు కొందరి పేర్లు వినపడుతూనే ఉన్నాయి.

ఇలా ఈ కార్యక్రమం గురించి ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై బిగ్ బాస్ నిర్వాహకులు ఏమాత్రం స్పందించలేదు. ఇకపోతే ఈ కార్యక్రమం ఆగస్టు నెలలో ప్రసారమవుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఆగస్టు చివరి వారంలో ఈ కార్యక్రమం ప్రేక్షకుల ముందుకు రానుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై బిగ్ బాస్ ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో బిగ్ బాస్ కార్యక్రమం ఉన్నట్టా లేనట్టా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రసారమైన వెంటనే ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి కుదరడం లేదు అదేవిధంగా మరోవైపు నాగార్జున కూడా బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేకపోతున్నామని నిర్వాహకులు వెల్లడించారు. ఇకపోతే ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడం కోసం ప్రోమో కూడా షూట్ చేశారని తెలుస్తుంది.త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేస్తారని అలాగే ఆగస్టు చివరివారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమం ప్రసారం కానుందని తెలుస్తోంది. ప్రోమో విడుదల చేసిన రోజే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే తేదీని కూడా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.