రాబోయే రోజుల్లో బంగారు ధరలు తగ్గనున్నాయా..!

బంగారానికి మళ్లీ రెక్కలు వస్తున్నాయి. ఈమధ్య తగ్గినట్లు కనిపించిన పసిడి ధర మళ్లీ పెరుగుతుంది. ఇందుకు ఏ అంశాలు కారణమవుతున్నాయో తెలుసుకుందాం. ఆగస్టులో మొదటి పది రోజులు బంగారం ధరలు తగ్గాయి. ఎందుకంటే, ఇండియాలో కరోనా తగ్గిపోతుందిలే అనే అభిప్రాయం పెట్టుబడిదారుల్లో కలిగింది. గోల్డ్ పై ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్మెంట్స్ ని వెనక్కి తీసుకున్నారు. అంతలోనే మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ వచ్చేస్తుంది అనే వార్తలు వస్తుంటే మళ్ళీ పెట్టుబడిదారులు, బంగారం వైపు చూస్తున్నారు.

నిజానికి బంగారం ధరలు ఏప్రిల్ ఒకటి నుంచి పెరుగుతూ వస్తున్నాయి. మధ్యలో కాస్త తగ్గిన, నాలుగున్నర నెలల ట్రేడ్ చూస్తే, ధరలు పెరుగుతున్న విషయం అర్థమవుతుంది. కానీ, రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ ల బంగారం ధర 51,800 గా, 22 క్యారెట్ బంగారు ఆభరణాల ధర 47,450 గా ఉంది. డాలర్ బలంగా ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వు రానున్న రోజుల్లో ధరలను పెంచే అవకాశాలు ఉండడం కూడా బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తుంది.

అయితే, బంగారం ధరలు మరీ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు కూడా లేవంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ అమ్మకాలు చూస్తున్నాం. అలాగే, బాండ్లు, కరెన్సీలలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. బంగారం ధరలు అమెరికా వడ్డీరేట్లకు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. వడ్డీ రేట్ల పెరుగుదలతో బంగారంలో పెట్టుబడుల వ్యయాలు ఇన్వెస్టర్లకు పెరిగిపోతాయి. సెప్టెంబర్ దగ్గరలో ఫెడ్ వడ్డీ రేటును అర శాతం పెంచవచ్చని తెలుస్తుంది. కనుక గోల్డ్ ఇన్వెస్టర్లు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.