ఇండస్ట్రీ టాక్ : “NBK 107” కి ఈ రెండు టైటిల్స్ లో ఒక కన్ఫార్మ్ అట..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా తన కెరీర్ లో 107వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత చేసే 108వ సినిమాపై కూడా నిన్ననే మైండ్ బ్లాకింగ్ అప్డేట్ కూడా బయటకి వచ్చింది.

ఇక ఇదిలా ఉండగా రెండు సినిమాలు కూడా మంచి ఏక్షన్ ఎంటర్టైనర్స్ కాగా బాలయ్య 107వ సినిమాపై అయితే లేటెస్ట్ గా ఓ అప్డేట్ దాదాపు కన్ఫర్మ్ అన్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ బయటకి వచ్చింది. అయితే ఈ సినిమాకి ప్రస్తుతం రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.

మొదటిది ముందు నుంచి కూడా ఉన్న టైటిల్ “జై బాలయ్య” కాగా మరొకటి “రెడ్డి గారు” అని తెలుస్తుంది. డెఫినెట్ గా అయితే ఈ రెండు టైటిల్స్ లో ఒకటి కన్ఫర్మ్ చేసేస్తారని ఇండస్ట్రీ వర్గాల నుంచి లేటెస్ట్ సమాచారం. మరి దీనిపై అయితే అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

ఇక ఈ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాణం వహిస్తున్నారు.