ఒకే ఒక్క ఫ్లాప్… యంగ్ హీరో జాత‌కం రివ‌ర్స్

ఒకే ఒక్క ఫ్లాప్… యంగ్ హీరో జాత‌కం రివ‌ర్స్

బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాలీవుడ్ గేమ్ ఛేంజ‌ర్ అనుకుంటే ఇంత‌లోనే ఇలా అయ్యిందేం? ప‌్ర‌తిదీ మొద‌టి సినిమా అనుకునే చోట ఏమ‌రుపాటుగా ఉంటే ఇలానే ఉంటుంది మ‌రి! హిట్టును మాత్ర‌మే న‌మ్మే సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో ఒక్క త‌ప్పు చేసినా అంతే సంగ‌తి. ప్ర‌స్తుతం ఆ యంగ్ హీరో గురించిన చ‌ర్చ ఇదీ. టాలీవుడ్‌ని నాలుగైదు సినిమాల‌తోనే గొప్ప‌గా ప్ర‌భావితం చేసిన ఆ హీరో ఒకే ఒక్క‌ ప‌రాజ‌యంతో డౌన్ ఫాల్ అవ్వ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. 

అయితే కేవ‌లం ప‌రాజ‌యం ఒక్క‌టే ఇందుకు కార‌ణం కాదు. అత‌డి యాటిట్యూడ్ కూడా ఓ కార‌ణం అన్న ముచ్చ‌ట ఇటీవ‌ల విస్త్ర‌తంగా సాగుతోంది. ఇంత‌కు ముందు అత‌నితో సినిమాలు చేసేందుకు ప‌లువురు ఎన్నారైలు ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప‌లువురు ప‌రిశ్ర‌మ అగ్ర‌ నిర్మాత‌లు క్యూక‌ట్టారు. అయినా వీళ్లెవ‌రినీ ఆ హీరో లెక్క‌చేయ‌లేదు. క‌నీసం ప‌ట్టించుకున్న‌దే లేదు. కొంద‌రు ఎన్నారైల‌కైతే ఆఫ‌ర్ ఇచ్చినా స‌రైన‌ రిప్లై కూడా ఇవ్వ‌లేదు. క‌నీసం క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ కోసం సంప్ర‌దించినా అవ‌కాశం ఇవ్వ‌లేదు. అప్ప‌ట్లో వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న ఓ టాప్ డైరెక్ట‌ర్ ఆఫ‌ర్ ని రిజెక్ట్ చేశాడు. స‌ద‌రు యంగ్ హీరో పీఏ ద‌గ్గ‌రే అవ‌న్నీ రిజెక్ట్ అవ్వ‌డం అవ‌త‌లి వారిని తీవ్రంగానే నిరాశ‌ప‌రిచింది. అంతేనా స‌ద‌రు యంగ్ హీరో చుట్టూ ఉండే కోట‌రీని ముందుగా సంప్ర‌దించాకే త‌న‌ను క‌ల‌వాల్సి ఉంటుంది. ఇలాంటి స్వ‌యంకృతాలు అత‌డిని ఇప్పుడు వెంటాడుతున్నాయ‌ట‌.

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ స్పీడ్ పెంచాల‌నుకున్న‌ స‌ద‌రు యంగ్ హీరో త‌న చుట్టూ జ‌రుగుతున్న ప‌రిణామాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు దానిపై సీరియ‌స్ గానే ఆలోచిస్తున్నాడ‌ట‌. చేసిన త‌ప్పుల్ని స‌రిదిద్దుకునేందుకు తొలి అడుగు వేస్తున్నాడ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం  ఒకే ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్టు కొట్టిన ఆ టాప్ డైరెక్ట‌ర్ ఇచ్చే ఆఫ‌ర్ కోసం వేచి చూస్తున్నాడ‌ట‌. ప‌రిశ్ర‌మ‌లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌ని చెబుతుంటారు. యాటిట్యూడ్ చూపిస్తే కొన్నిసార్లు వ‌ర్క‌వుట‌వుతుంది. చాలాసార్లు బెడిసికొడుతుంది! అంటూ మాట్లాడుకుంటున్నారు.