Rashmika: టాలీవుడ్ హీరోతో రష్మిక పెళ్లి పిక్స్… అసలు విషయం బయట పెట్టిన ప్రొడ్యూసర్?

Rashmika: బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదల కావడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక బాలకృష్ణ కూడా ఈ సినిమా ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి డాకు మహారాజా నిర్మాత నాగ వంశీ డైరెక్టర్ బాబి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హాజరై సందడి చేశారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక చిన్న ప్రోమో బయటకు వచ్చింది అయితే ఈ ప్రోమో వీడియోలో భాగంగా రష్మిక గురించి అలాగే ఆమె పెళ్లి గురించి ప్రస్తావనకు రావడం విశేషం. ఈ కార్యక్రమంలోకి తమన్ ఉరుములు మెరుపులతో ఎంట్రీ ఇచ్చారు. థియేటర్లలో స్పీకర్ కాలిపోయిందంటే దాని క్రెడిట్ బాలయ్యకే అన్నాడు. మరోసారి కూడా స్పీకర్లు పేలిపోతాయి అంటూ డాకు మహారాజ సినిమాపై తమన్ భారీ స్థాయిలో హైప్ పెంచేశారు.

తమన్ గురించి తాను ఇంటర్నేషనల్ స్టోరీస్ విన్నానని, అనుష్క అంటే తనకు ఇష్టం కదా అని అన్నారు. తనకు రష్మిక అంటే క్రష్ అని, పెళ్లి సెటిల్ అయ్యిందని విన్నానని చెప్పారు. అంతలోపు నిర్మాత నాగ వంశీ కలగ చేసుకొని తెలుగు హీరోను పెళ్లి చేసుకుంటుందని తెలుసు. కానీ ఎవరు అనేది మాత్రం బయటికి చెప్పడం లేదు అంటూ రష్మిక పెళ్లి గురించి ఈ కార్యక్రమంలో చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే గత కొంతకాలంగా రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు కానీ వీరి ప్రేమ విషయాన్ని మాత్రం బయట పెట్టకపోవడంతో తరచూ వీరి గురించి వార్తలు వినపడుతున్నాయి ఇటీవల ఓ సందర్భంలో రష్మిక సైతం తాను ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నానని ఆ వ్యక్తి ఎవరో మీ అందరికీ కూడా తెలుసు అంటూ పరోక్షంగా విజయ్ దేవరకొండ గురించి తెలిపారు.