Tollywood Hero: సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు కూడా సాధారణ మనుషులే కాబట్టి మనలాగే వారికి కూడా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి. అయితే చాలా మంది సెలబ్రిటీలు వారికి ఉన్నటువంటి సమస్యలను బయటపెడుతూ ఉంటారు మరికొందరు వారి విషయాలను దాచేస్తూ ఉంటారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న ఒక యంగ్ హీరోకి విచిత్రమైనటువంటి వ్యాధి ఉందట ఈ వ్యాధి కారణంగా ఆయన ఎవరితోనూ మాట్లాడరని అలాగే ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ వ్యాధి కోసం చికిత్స చేసుకుంటే తన ముఖం మొత్తం మారిపోతుందని అందుకే ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నారంటూ స్వయంగా హీరో వెల్లడించారు. మరి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.. ఆయన మరెవరో కాదు నటుడు సందీప్ కిషన్. తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన ఈయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తనకున్నటువంటి జబ్బు గురించి బయట పెట్టారు. తాను సైనస్ తో బాధపడుతున్నట్టు తెలిపాడు. షూటింగ్ లో గ్యాప్ లో కార్ వ్యాన్ లోకి వెళ్లి నిద్రపోతాను అని చెప్పాడు. పడుకున్న తర్వాత నా ముక్కునుంచి తన వెనక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు.
ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను. మా అమ్మానాన్నతో కూడా మాట్లాడానని తెలిపారు.ఉదయాన్నే వేడిగా టీ తాగి, మెడిటేషన్ మ్యూజిక్, స్తోత్రాలు విని ఆతర్వాత మాట్లాడతా అని చెప్పాడు. అలాగే దీని కోసం సర్జరీ చేయించుకోవాలి.. ఆపరేషన్ చేయించుకుంటే నా ముక్కు మారిపోతుంది అలాగే మొహం కూడా మారిపోతుంది అన్న ఉద్దేశంతోనే తాను సర్జరీ చేయించుకోవట్లేదు అంటూ ఈ సందర్భంగా సందీప్ కిషన్ తనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను కూడా బయటపెట్టారు. దీంతో నెటిజెన్స్ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఆరోగ్యం కంటే అందం ముఖ్యం కాదని సలహాలు ఇస్తున్నారు.
