‘అయినను పోయి రావలె హస్తినకు’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఓ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా తీయబోతున్నాడని ఇప్పటికే చాల రకాలుగా రూమర్స్ వచ్చాయి. ఈ చిత్రం కోసం ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని.. రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా సినిమాలో ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాసినట్లు కూడా బాగానే వైరల్ అయ్యాయి.
మొత్తానికి ఎన్టీఆర్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర అని, నేటి రాజకీయాలకి ఓ కొత్త ఒరవడిని పరిచయం చేసేలా ఎన్టీఆర్ పాత్రను త్రివిక్రమ్ రాస్తున్నాడనే వార్త కూడా బాగానే వైరల్ అయింది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకోవాలని మేకర్స్ ఫీల్ అవుతున్నారు. మరో కథానాయికగా తన గత రెండు సినిమాల్లో నటించిన పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్.
‘అరవింద సమేత’లో ఎన్టీఆర్, పూజా హెగ్డేల జోడీ చాలా బాగా కుదిరింది. అయితే ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అందుకే మళ్లీ ఆమెనే రిపీట్ చేయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారని టాక్. మరి పూజా హెగ్డే ఫైనల్ అవుతుందో లేదో తెలియాలంటే కొంత వెయిట్ చేయాల్సిందే. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని నవంబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా 2021 సమ్మర్ లో విడుదల కానుంది.