త్రివిక్రమ్ – పవన్ మూవీ.. ఇలా సెట్టయ్యిందన్నమాట!

పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్ మొత్తంలో అగ్ర దర్శకులతో సినిమాలు చేసింది చాలా తక్కువ. పవర్ స్టార్ తో సినిమా చేసిన తరువాత దర్శకులు వారి స్థాయిని పెంచుకుంటున్నారు గాని పవన్ అయితే ఏనాడు కూడా మంచి ఫామ్ లో ఉన్న దర్శకులను కావాలని సెలెక్ట్ చేసుకున్నది లేదు. ఇక త్రివిక్రమ్ ఒక్కడే పవన్ తో మూడు సినిమాలు చేశాడు. కానీ అజ్ఞాతవాసి కొట్టిన దెబ్బను అభిమానులు ఇంకా మర్చిపోలేదు.

ఎలాగైనా త్రివిక్రమ్ ఆ మచ్చను మరచిపోయేలా ఒక మంచి సక్సెస్ ఇస్తే బావుంటుందని ఆశపడుతున్నారు. అయితే త్రివిక్రమ్ పవన్ తో సినిమా చేయకపోవడానికి ప్రధాన కారణం.. అంచనాలు భారీగా ఉండడమే. ఒకవేళ అజ్ఞాతవాసి గనక హిట్ అయ్యి ఉంటే ఆ కలెక్షన్స్ మామూలుగా ఉండేవి కావు. అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో అజ్ఞాతవాసి ఒకటి.
ఇక త్రివిక్రమ్ కూడా పవన్ కళ్యాణ్ కు ఎలాగైనా తన ద్వారా హిట్ వచ్చే ప్రయత్నం చేయాలని ఎంతో ఆశగా ఉన్నాడు.

అందుకే అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాను ట్రాక్ లోకి తెచ్చాడు. ఆ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ లో మాటలు స్క్రీన్ ప్లే అంధించడమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ అంతా కూడా త్రివిక్రమ్ చూసుకుంటున్నట్లు సమాచారం. ఇక సినిమాకు దర్శకుడిగా సాగర్ చంద్ర ఉన్నప్పటికీ ఎక్కువగా త్రివిక్రమ్ చెప్పినట్లుగానే సినిమా మేకింగ్ ఉంటుందని ఇన్ సైడ్ టాక్. అసలు త్రివిక్రమ్ అనుకుంటే ఈ సినిమాను 50రోజుల్లో ఫినిష్ చేయగలడు. కానీ అంచనాల వల్ల అభిమానుల్లో ఆలోచనలు మారతాయని త్రివిక్రమ్ సైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి సినిమాలో ఆయన మార్క్ ఏమైనా కనిపిస్తుందో లేదో చూడాలి.