మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పలు భారీ సినిమాతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఒకదాన్ని మించి ఇంకొకటి స్టార్ట్ చేస్తూ కూడా వెళ్లిపోతున్నారు. రీసెంట్ గానే దర్శకుడు బాబీ తో సినిమా కూడా స్టార్ట్ చేయగా ఇంకా కొంతమంది దర్శకులు చిరు లైన్ లో ఉన్నారని తెలుస్తోంది. అయితే అయితే మెగాస్టార్ లో ఓ గొప్ప లక్షణం ఉంది.. ఎంత లేట్ అయినా కూడా తాను ఒకరికి మాట ఇచ్చారు అంటే అది నిలబెట్టుకొని తీరతారు.
అలా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ బడా ప్రాజెక్ట్ పైనే ఇండస్ట్రీ వర్గాల్లో బజ్ స్టార్ట్ అయ్యింది. ఈ కాంబోలో కూడా సినిమా ఉందట. కానీ ఎప్పుడు అనౌన్స్ అవుతుంది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేవి మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సెన్సేషనల్ కాంబో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఇదెప్పుడు మొదలు కానుందో చూడాలి.