Director Trivikram : షాకింగ్ : పోలీసు కేసులో మొన్న మనోజ్ ఇప్పుడు త్రివిక్రమ్..! వివరాలు ఇవే!

Director Trivikram : తాజాగా టాలీవుడ్ లో ఒక సంచలన సంఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. రేవ్ పార్టీ లు అంటూ అనేక మంది సినీ తారలపై ఆకస్మిక పోలీసు దాడులు కలకలం రేపాయి.
అయితే దీనికి దాదాపు రెండు మూడు రోజులు కిందే టాలీవుడ్ కి చెందిన మంచు వారి హీరో మంచు మనోజ్ పోలీసులు లకి వేరే కారణమై చిక్కడం ఆసక్తి గా మారింది.
హైదరాబాద్ లో ట్రాఫిక్ పోలీసులు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మనోజ్ కి వారు రుచి చూపించారు.
ఎప్పుడో ప్రభుత్వ ఆర్డర్ లను జారీ చేసినటువంటి కార్ ఫిలిమ్స్ విషయంలో మనోజ్ రూల్ బ్రేక్ చెయ్యడంతో అతడిపై హైదరాబాద్ సిటీ పోలీసులు కేస్ బుక్ చేశారు.
ఇక ఇప్పుడు సరిగ్గా ఇదే కారణంతో టాలీవుడ్ లో స్టార్ దర్శకుడు అయినటువంటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా దొరికిపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
త్రివిక్రమ్ కూడా తన కార్ కి బ్లాక్ ఫిలిమ్స్ వేసుకొని హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో చక్కర్లు కొడుతుండగా పోలీసులు ఆపి కేసు బుక్ చేసి ఫైన్ వేసారట. అంతే కాకుండా అక్కడికక్కడే ఆ ఫిలిమ్స్ ని తొలగించినట్టు కూడా తెలుస్తోంది.
ఇలా అప్పుడు మనోజ్ దొరకగా ఇప్పుడు త్రివిక్రమ్ చిక్కాడు. మరి రీసెంట్ గా అయితే త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే ఇచ్చిన చిత్రం “భీమ్లా నాయక్” రిలీజ్ అయ్యిన సంగతి అందరికీ తెలిసిందే. అలాగే దీని తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తాను డైరెక్ట్ చెయ్యనున్నాడు.