సాధారణంగా దర్శకులు తమ ప్రెవేట్ లైఫ్ ని బయిటపెట్టడానికి ఇష్టపడరు. అలాగే జనం కూడా హీరో,హీరోయిన్స్ తప్పితే మిగతా వాళ్ల గురించి పెద్దగా ఆలోచించరు. కానీ విజయ్ దేవరకొండతో ‘నోటా’ చిత్రం చేసిన దర్శకుడు ఆనంద్ శంకర్ మాత్రం కాస్త స్పీడుగా ఉన్నాడు. తన గర్ల్ ఫ్రెండ్ తో లిప్ టు లిప్ కిస్ ఇచ్చి ఆ ఫోటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
ఆ ట్వీట్ లో ‘‘ సాధారణంగా నా ప్రైవేట్ లైఫ్ గురించి నేను ఓపెన్ గా ఉండటానికి ఇష్టపడను. కానీ మొట్టమొదటి సారిగా ఈ పోస్ట్ పెడుతున్నా. నేను చాలా ప్రైవేట్.. అలాగే చాలా సిగ్గరిని. అయినప్పటికీ నా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని భావించి ఈ పిక్స్ ని మీకు షేర్ చేస్తున్నా. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఎప్పటికీ కావాలి. దుబాయ్ 2018, హ్యాపీ దీపావళి’’ అని ట్వీట్‌లో ఆనంద్ శంకర్ పేర్కొన్నారు.
అంతేకాకుండా తాను ఆమెకు ప్రపోజ్ చేశానని.. ఆమె అంగీకరించిందని తెలిపారు. ఈ ట్వీట్ చూసిన ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు ఆనంద్‌కు విషెష్ తెలియజేస్తున్నారు.