నివాసి టీజ‌ర్ ని లాంచ్ చేసిన ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ 

శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట లాంటి మంచి చిత్రంలో న‌టించి మెప్పించిన శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా, వివియా, విద్య  హీరోయిన్స్‌గా , స‌తీష్ రేగ‌ళ్ళ ని ద‌ర్శ‌కుడు గా ప‌రిచ‌యం చేస్తూ గాయ‌త్రి ప్రోడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌ లో కె.ఎన్‌.రావు గారు నిర్మాత‌గా రూపొందించిన చిత్రం నివాసి.  ఇప్ప‌టికే షూటింగ్ ని దాదాపు కంప్లీట్ చేసుకున్నారు.  ఇది ఒక ఫ్యామిలీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతుంది. ట్రావెల్ బేస్డ్ స్టోరి. చ‌ర‌ణ్-అర్జున్ సంగీత ద‌ర్శ‌కులు. ప్ర‌స్తుతం పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మెద‌టి లుక్ టీజ‌ర్ ని టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు వి.వినాయ‌క్‌, స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత సి.క‌ళ్యాణ్ గారు విడుద‌ల చేశారు. 

ఈసంద‌ర్బంగా సెన్సేషనల్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ గారు మాట్లాడుతూ..  మా బ్ర‌ద‌ర్ సి.క‌ళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రావు గారు నిర్మాత‌గా స‌తీష్ రేగ‌ళ్ళ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యం అవుతూ మా వ‌ర్శ త‌మ్ముడు శేఖ‌ర్ వ‌ర్మ ని హీరోగా చూపించిన చిత్రం నివాసి.. ఈ చిత్రం టీజ‌ర్ బాగుంది. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించాల‌ని, అలానే శేఖ‌ర్ వ‌ర్మ హీరోగా కెరీర్ బాగుండాల‌ని కొరుకుంటున్నాను.. అన్నారు

చిత్ర స‌మ‌ర్ప‌కులు సి.క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. నివాసి చిత్రం రావు గారు నిర్మాత‌గా స‌తీష్ రేగ‌ళ్ళ ద‌ర్శ‌కుడు గా నా ఆద్వ‌ర్యంలో విడుద‌ల కానుంది. ఈ చిత్రం డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో చిత్రిక‌రించారు. అంద‌ర్ని మెప్పించే చిత్రంగా త్వ‌ర‌లో విడుద‌ల అవుతుంది. ఈరోజు మా సోద‌రుడు వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల చేశారు. త్వ‌ర‌లో అన్ని వివ‌రాలు తెలియ‌జేస్తాం.. అని అన్నారు

హీరో శేఖ‌ర్ వ‌ర్మ  మాట్లాడుతూ.. నివాసి చిత్రం తో నేను అంద‌రికి రీచ్ అవుతాన‌ని న‌మ్ముతున్నాను. అలానే ఈరోజు టీజ‌ర్ లాంచ్ చేసిన క‌ళ్యాణ్ గారికి, వినాయ‌క్ గారికి నా ప్రత్యేకంగా ధ‌న్య‌వాదాలు చెబుతున్నాను.. ఈ చిత్రం చాలా మంచి చిత్రం అని మాత్రం ధీమాగా చెప్ప‌గ‌ల‌ను అని అన్నారు..

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు స‌తీష్ రేగ‌ళ్ళ మాట్లాడుతూ.. శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట సినిమా చూశాను. ఆ సినిమా లో శేఖ‌ర్ వ‌ర్మ చాలా చ‌క్క‌గా న‌టించి మెప్పించాడు. ఇప్పుడు మా నివాసి లో శేఖ‌ర్ లోని ఇంకో యాంగిల్ ని చూపిస్తున్నాము. ఈ చిత్రం త‌రువాత శేఖ‌ర్ చాలా మంచి న‌టుడుగా సక్సెస్ అవుతాడు. అలాగే నిర్మాత‌లు కె.ఎన్‌.రావు గారు, వ‌ర్మ గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చిత్రాన్ని తెర‌కెక్కించారు.. చిత్రం షూటింగ్ పూర్త‌యింది. ఈరోజు టీజ‌ర్ ని లాంచ్ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు వి.వి.వినాయ‌క్ గారికి, సి.క‌ళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.. అని అన్నారు