పెళ్లి మ్యాటర్‌కి వస్తే నితిన్ కూడా రానా, నిఖిల్ అడుగుజాడలను అనుసరిస్తున్నట్లు తాజా సమాచారం. నితిన్ తన ప్రియురాలు శాలినిని జూలై 26 న హైదరాబాద్‌లో వివాహం చేసుకోనున్నారు. ఇది వారి కుటుంబాలు నిర్ణయించిన కొత్త వివాహ తేదీ. లాక్డౌన్ వల్ల నిఖిల్ తన ప్రియురాలిని గత నెలలో వివాహం చేసుకోగా.. రానా రోకా వేడుకను ముగించాడు. అతని వివాహ తేదీని ఆగస్టు 8 గా నిర్ణయించారు.
ఏప్రిల్ 16 న తన ప్రేయసి షాలినిని వివాహం చేసుకోవాలనుకున్న యూత్ స్టార్ నితిన్ మాత్రం కరోనావైరస్ పూర్తిగా తగ్గుముఖం పట్టడం కోసం ఎదురుచూడటం అవివేకమని అంగీకరించారు. నితిన్ – షాలిని జంట మొదటి ముహూర్తం కాదనుకుని ఆ తర్వాత దుబాయ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలని కలలు కన్నారు. కానీ మహమ్మారి వారి కలలను కల్లలు చేసింది. ఇప్పుడు వారు ఒక చిన్న వివాహాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌ను వేదికగా నిర్ణయించారు.
COVID-19 మహమ్మారి కారణంగా సామాజిక సమావేశాలు .. వివాహాలకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఈ పెళ్లి వేడుకలోనూ పాటిస్తారు. వివాహ వేడుకలు పూర్తయిన తర్వాత నితిన్ `రంగ్ దే` షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తాడు. ఈ చిత్రానికి వెంకి అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు.