2025 అంతా యవతరానిదే.. చేతినిండా ప్రాజెక్టులతో యువ హీరోలు

ఒక సంవత్సరంలో రిలీజ్ అయ్యి సినిమాలలో సింహభాగం యువతరం హీరోలు తీసిన సినిమాలే ఎక్కువగా ఉంటాయి. సీనియర్ హీరోలు తీసే సినిమాలు ఎంత పెద్ద హిట్ అయినా యువ తరం హీరోలు తీసే సినిమాలు కి ఉండే క్రేజే వేరు. అయితే 2024లో చాలామంది యువ హీరోలు ఒక సినిమాతో కూడా మన ముందుకి రాలేదు. అయితే వాళ్ళ ఫ్యాన్స్ కి 2025లో తప్పకుండా వస్తామంటూ వారి సినిమా విశేషాలు చెప్పారు చాలామంది యువ హీరోలు. ఏ హీరోలు ఏ సినిమాలతో వచ్చే సంవత్సరం వస్తున్నారో ఒకసారి చూద్దాం.

ముందుగా చాక్లెట్ బాయ్ నితిన్ గురించి చూద్దాం గత ఏడాది ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్ సినిమాతో ముందుకు వచ్చాడు ఈ సంవత్సరం రాబిన్ హుడ్ సినిమాతో పలకరించవలసింది కానీ అనుకోని కారణాల వలన అది వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ అయింది. వచ్చే సంవత్సరం ఎల్లమ్మ అనే కొత్త సినిమాను కూడా ప్రారంభిస్తున్నాడు నితిన్. కాబట్టి వచ్చే సంవత్సరం నితిన్ నుంచి రెండు సినిమాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు.

అడవి శేష్ గూడచారి సినిమాకి సీక్వెల్ గా జీ 2 పేరుతో ఒక సినిమా, డేకాయిట్ ఏ లవ్ స్టోరీ పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలు రెండు వచ్చే సంవత్సరం థియేటర్లోకి రాబోతున్నాయి. ఈ ఏడాది తండేల్ సినిమాతో రావలసిన నాగచైతన్య చిత్రీకరణ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది మన ముందుకు వస్తాడు ఆ సినిమాతో పాటు కార్తీక్ దండు డైరెక్షన్లో మరో సినిమాలో కూడా చైతన్య చేస్తున్నాడు ఈ సినిమా కూడా వచ్చే సంవత్సరం థియేటర్లలోకి రాబోతుంది. సినిమా ఈ సంవత్సరం ఒకటి కూడా విడుదల కాలేదు కానీ వచ్చే సంవత్సరం ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్లో మన ముందుకి రాబోతున్నట్లు సమాచారం. అలాగే సాయి ధరమ్ తేజ్ సంబరాలు ఏటిగట్టు సినిమాతో వచ్చే సంవత్సరం మనల్ని పలకరిస్తాడు. నవీన్ పోలిశెట్టి వచ్చే సంవత్సరం అనగనగా ఒక రాజు సినిమాతో రాబోతున్నాడు.