Robin Hood: విడుదల వాయిదా వేసుకున్న నితిన్ రాబిన్ హుడ్… కారణం అదేనా?

Robin Hood: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈయన నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాతో పాటు తమ్ముడు అనే సినిమాలో కూడా ఈయన నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే శ్రీ లీల నితిన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ నెల 20వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఇటీవల ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా మరో మూడు రోజులలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేసినట్టు తెలుస్తుంది అయితే ఈ సినిమా విడుదల వాయిదా కావడానికి కారణం లేకపోలేదు. క్రిస్మస్ పండుగను పురష్కరించుకొని ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇంకా ఇప్పటికే పుష్ప సినిమా హావా అన్ని థియేటర్లలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా రిలీజ్ రోజే అల్లరి నరేష్ నటిస్తున్న బచ్చల మల్లి సినిమా ఉంది. అలాగే ఉపేంద్ర నటిస్తున్న UI సినిమా కూడా ఉంది. ఈ సినిమాల తర్వాత బేబీ జాన్, వెన్నెల కిషోర్ నటిస్తున్న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్, అలాగే మహేష్ బాబు వాయిస్ అందించిన ముఫాసా సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి ఇలాంటి సమయంలో ఈ సినిమాని విడుదల చేయడం సరైనది కాదని భావించిన మేకర్స్ ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు అధికారికంగా వెల్లడించారు.

ఇక వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఎంతోమంది పెద్ద హీరోలు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దీంతో ఈ సినిమాలన్నీ విడుదలైన తర్వాత రాబిన్ హుడ్ సినిమాని సింగిల్ గా విడుదల చేయాలనే ఆలోచనలు మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు తిరిగి ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తారా అనే విషయాన్ని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు.