Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు ఈమె పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోవడంతో అప్పటినుంచి ఈమెకు వరుస పాన్ ఇండియా సినిమాలలో నటించే అవకాశాలు వస్తున్నాయి అదేవిధంగా బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నటువంటి రష్మికకు సంబంధించిన ఒక టాప్ సీక్రెట్ ఒక హీరో బయటపెట్టారు దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా మనకు ఆకలేస్తే సమయానికి భోజనం చేయడం లేదంటే స్నాక్స్ తినడం వంటివి చేస్తూ ఉంటాము కానీ రష్మిక మాత్రం తనకు ఎప్పుడైనా ఆకలి వేస్తే కుక్క బిస్కెట్లు తింటుంది అంటూ ఒక హీరో తెలియజేశారు.
ఇది తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు కుక్క బిస్కెట్లు తినడం ఏంటి అంటూ కామెంట్లో పెడుతున్నారు. రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి వచ్చిన మొదటిలో నితిన్ తో కలిసి భీష్మ అనే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా నితిన్ ఈ విషయాన్ని బయట పెట్టారు.
రష్మిక కుక్క బిస్కెట్లు తినే అలవాటు ఉంది అంటూ ఒక్కసారిగా ఈ న్యూస్ బయట పెట్టారు. ఇలా చెబుతున్న క్రమంలో రష్మిక ఆపే ప్రయత్నం చేసిన నితిన్ మాత్రం ఈ సీక్రెట్ బయటపెట్టారు. తనకు కుక్క బిస్కెట్లు తినే అలవాటు ఉందని థ్యాంక్ గాడ్ నాకు ఈ సినిమాలో ఎలాంటి లిప్ కిస్ సన్నివేశాలు లేవు అంటూ నితిన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవడంతో కొంతమంది అభిమానులు ఇదేం అలవాటు తల్లి కుక్క బిస్కెట్లు తినడం అంటూ కామెంట్లు చేస్తున్నారు.