నితిన్ పెళ్లి గెస్టులు ఎవ‌రో తెలిస్తే షాకే

                                కేసీఆర్- ప‌వ‌ర్ స్టార్ నితిన్ పెళ్లి గెస్టులు

యూత్ స్టార్ నితిన్ పెళ్లితో ఓ ఇంటివాడ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈనెల 26న హైద‌రాబాద్ తాజ్ ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో ఈ వివాహం కొద్దిమంది బంధుమిత్రుల స‌మ‌క్షంలో జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌ల‌ పాత బ‌స్తీలో జ‌రుగుతున్న టాప్ సెల‌బ్రిటీ వెడ్డింగ్ ఇదే. ఇక ఈ పెళ్లి వేడుక మ‌హ‌మ్మారీ కండీష‌న్స్ వ‌ల్ల చాలా సాధాసీదాగానే జ‌ర‌గ‌నుంది. భారీగా అతిథుల‌కు ఆహ్వానం లేదు.

అయితే ఎవ‌రెవ‌రు ఈ పెళ్లి వేడుక‌కు ఎటెండ‌వుతారు? అంటే .. నితిన్ ఎంత‌గానో అభిమానించే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి .. ఐటీ శాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ర తార‌క రామారావు (కేటీఆర్) ఎటెండ‌వుతార‌ని తెలిసింది. వీళ్ల‌తో పాటే మ‌రో ఇద్ద‌రు సినీప్ర‌ముఖుల‌కు ఆహ్వానం అందింద‌ట‌. నితిన్ అభిమానించే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ అలానే త‌న స‌న్నిహిత హీరో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ల‌కు ఆహ్వానం అందింద‌ట‌.

ఇరు కుటుంబ స‌భ్యులు కూడా ప‌రిమితంగానే అటెండ‌వుతున్నార‌ట‌. ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ లో పెళ్లి అన‌గానే స‌ల్మాన్ ఖాన్ సోద‌రి అర్పితాఖాన్ పెళ్లి గుర్తుకొస్తుంది. ఆ త‌ర్వాత త‌మిళ హీరో ఆర్య – స‌యేషా సైగ‌ల్ పెళ్లి ఇదే వేదిక‌పై జ‌రిగింది. ఇప్పుడు నితిన్ పెళ్లి ఇక్క‌డే. త‌దుప‌రి రానా – మిహీక జంట పెళ్లి కూడా ఇదే వేదిక‌పై జ‌ర‌గ‌నుంది.