నితిన్ కూడ అదే దారి చూసుకుంటున్నాడా ?

Nithiin's Maestro may be out in OTT
 Nithiin's  Maestro may be out in OTT
యూత్ హీరో నితిన్ వరుస ఫ్లాపులతో సతమవుతున్నాడు.  ఇటీవల చేసిన ‘చెక్’ ఫ్లాప్ అవ్వగా ‘రంగ్ దే’ జస్ట్ ఓకే అనిపించుకుంది.  దీంతో ఆయన ఆశలన్నీ ‘అంధాధూన్’ రీమేక్ మీదనే పెట్టుకున్నారు.  హిందీలో సూపర్ హిట్టయిన ఈ సినిమాను నితిన్ రీమేక్ చేస్తున్నాడు.  మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు.  చాలా త్వరగా చిత్రీకరణను కంప్లీట్ చేసేశారు.  ఈరోజు షూటింగ్ మొత్తం ఫినిష్ అయింది.  దీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ స్టార్ చేశారు. ఇందులో నితిన్ అంధుడి పాత్రలో కనిపించనున్నాడు. తన కెరీర్లోనే నితిన్ చేస్తున్న పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం ఇది.  
 
ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.  రాబోయే రెండు నెలలు సినిమా హాళ్లు పెద్ద సినిమాలతో కిటకిటలాడుతుంటాయి కాబట్టి ‘మాస్ట్రో’ను ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే ఆలోచన చేస్తున్నారట.  ఇలాంటి చిత్రాలకు ఓటీటీ అయితేనే సేఫ్ ఫ్లాట్ ఫార్మ్ అని కూడ ఫీలవుతున్నారట.  మరి అనుకుంటున్నట్టే సినిమాను ఓటీటీకి వదులుతారా లేకపోతే నిర్ణయం మార్చుకుని థియేటర్లకే వస్తారా అనేది చూడాలి.  ఇకపోతే ఇందులో కథానాయకిగా నభ నటేష్ నటిస్తుండగా కీలకమైన నెగెటివ్ పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తోంది.