‘నిన్నే పెళ్లాడతా’ సినిమాలో రకుల్ ప్రీత్ సోదరుడు

“నిన్నే పెళ్లాడతా” సినిమాలో రకుల్ ప్రీత్ సోదరుడు

నాగార్జున, టబు నటించిన ‘‘నిన్నే పెళ్లాడతా’’ చిత్రం అప్పట్లో ఘాన విజయం సాధించింది .
చాలా సంవత్సరాల తరువాత ఇదే పేరుతో ఓ సినిమా తెలుగులో వస్తోంది . అయితే ఇందులో హీరో మాత్రం నాగార్జున కాదు . రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ . అవును నిజమే .ఏ చిత్రం ద్వారా అమన్ పరిచయమవుతున్నాడు

అంబికా ఆర్ట్స్, ఈశ్వరి ఆర్ట్స్ బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ బోను దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్ర లోగో‌ని అక్కినేని నాగార్జున గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వైకుంఠ మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర లోగోని ఆవిష్కరించిన నాగార్జునగారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ఆయన హిట్ చిత్రo ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్‌ లోగో ను ఆయన రిలీజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు మాకు సంతోషంగా ఉంది. అమన్, సిద్ధిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, సీత, ఇంద్రజ, సిజ్జు, అన్నపూర్ణమ్మ, మధునందన్ మిగతా పాత్రలు పోషించారు. ఇప్పటికే 50 శాతంకు పైగా షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 2 నుంచి వైజాగ్‌లో చివరి షెడ్యూల్ ప్రారంభించుకుని, అక్టోబర్‌లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. అని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ‘‘నిన్నే పెళ్లాడతా ఫస్ట్ లుక్‌ని నాగార్జున గారు ఆవిష్కరించినందుకు సంతోషంగా ఉంది. కొత్త వారిమైన మమ్మల్ని పెద్దమనసుతో ఆశీర్వదించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ చిత్రానికి కెమెరా: ఈదర ప్రసాద్, సంగీతం: నవనీత్, ఎడిటర్: అనకాల లోకేష్, ఫైట్స్: రామకృష్ణ, సహా నిర్మాత: సాయికిరణ్ కొనేరి, నిర్మాతలు: బొల్లినేని రాజశేఖర్ చౌదరి, వెలుగోడు శ్రీధర్ బాబు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వైకుంఠ బోను