ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ కి ఆల్మోస్ట్ దూరమైనట్టేనని తాజా సన్నివేశం చెబుతోంది. ప్రస్తుతానికి తమిళ్ .. హిందీలో బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. నాలుగైదేళ్ల పాటు టాలీవుడ్ లో హవా సాగించిన అమ్మడు ఇప్పుడు కోలీవుడ్ సహా బాలీవుడ్ ని టార్గెట్ చేసి ముందుకెళుతోంది. ప్రస్తుతం ఇండియన్ -2లో సెకెండ్ లీడ్ లో నటిస్తోంది. ఇంకా మరికొన్ని ప్రాజెక్ట్ లు చేతిలో ఉన్నాయి. అయితే ఈ అమ్మడు పేరు మాత్రం ఎఫైర్ల విషయంలో ఇప్పటివరకూ పెద్దగా వెలుగులోకి రాలేదు. ఆ మధ్య ఓ మంత్రి విషయంలో రకుల్ పేరు వినిపించింది. కానీ ఎందుకనో ఆ రూమర్ ఒక్కసారిగా చప్పబడిపోయింది. అంతకు ముందు ఎప్పుడూ సాటి హీరోతో ఎఫైర్ నడిపించినట్టు పుకార్లు అయినా రాలేదు.
ప్రేమలో పడకపోవడానికి… ఎఫైర్లు పెట్టుకోక పోవడానికి కారణం తన తమ్ముడేనని రకుల్ ఒకానొక సందర్భంలో పబ్లిగ్గానే చెప్పింది. తన బ్రదర్ అమన్ నిరంతరం తనని ఓ గుడాఛారిలా వెంటాడుతాడుట. రకుల్ షూటింగ్ ల్లో బిజీగా ఉన్నా.. రెగ్యులర్ గా తన విషయాలను ఏదోలా తెలుసుకుంటాడుట. ఇక రకుల్ కూడా ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు అమన్ కి అప్ డేట్ చేయాలిట. చిన్నప్పటి నుంచి రకుల్ వెంట అమన్ నీడలాగా ఉన్నాడుట. ఎప్పుడైనా ప్రెవసీ దొరుకుతుందా? అని ఆశపడితే ఆ ఛాన్స్ కూడా బ్రదర్ ఇవ్వడుట. మరి అమన్ అంటే ఎందుకంత భయం? అంటే.. ఏ విషయం జరిగినా ఇంట్లో అమన్ వెంటనే రిపోర్ట్ చేసేస్తాడుట.
దీంతో అలా చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు దూరంగా ఉండటం అలవాటైపోయిందని రకుల్ తెలిపింది. ఈ క్రమంలో చాలా మంది అబ్బాయిలను మాత్రం మిస్ అయ్యానని ఓపెన్ అయింది. అందుకే తనకి స్నేహితులు కూడా తక్కువ మందే ఉన్నారని తెలిపింది. అయితే అమన్ అంతగా వెంటపడటానికి అసలు కారణం రకుల్ ని నమ్మకపోవడమేనా? అన్న కొత్త సందేహం నెటిజనుల్ని వేధిస్తోంది మరి. దానికి అమ్మడు ఏమని అంటుందో చూడాలి. అమన్ ఇంత చేసినా తమ్ముడిపై ప్రేమ మాత్రం తగ్గలేదు సుమీ. తనని అంతగా కాపలా కాసిన రక్షకుడు తమన్ ని పెద్ద స్టార్ ని చేయాలని రకుల్ బాలీవుడ్ సహా టాలీవుడ్ లో ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.