ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో కు జూనియర్ కు ఆహ్వానం లేదా ?

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ క్రిష్  దర్శకత్వంలో నిర్మిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్ ” చిత్రం ఆడియో  విడుదల కార్యక్రమం ఈ నెల 21న నిమ్మకూరులో  జరుగుతుంది . ఈ విషయాన్ని యూనిట్ ప్రకటించింది . ఎన్టీఆర్ బయోపిక్  సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతుంది .

మొదటి భాగం “ఎన్టీఆర్  మహానటుడు ” జనవరి 9న విడుదల కాబోతుంది . 1983 జనవరి 9 ఎన్టీఆర్  ముఖ్య మంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు .

అందుకే ఆడియో కార్యక్రమాన్ని ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరులో జరపడానికి నిర్ణయించుకున్నారు . ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించిన స్టార్స్ అందరు హాజరవుతారని , పురందేశ్వరి , దగ్గుబాటి వెంకటేశ్వర రావు , జూనియర్ ఎన్టీఆర్ మినహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరవుతారని తెలుస్తుంది .  ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిధి గా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్ర బాబు నాయుడు పాల్గొంటారు కాబట్టి  బాలకృష్ణ స్వయంగా ఆహ్వానించినా డాక్టర్ వెంకటేశ్వర రావు , పురందేశ్వరి దంపతులు పాల్గొనే అవకాశంలేదు .

ఇక జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ పిలవక పోవచ్చు నని అంటున్నారు . తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని కూకట్ పల్లి నుంచి శాసన  సభ్యురాలిగా పోటీ చేసింది . ఆమె తరుపున చంద్ర బాబు నాయుడు , బాలకృష్ణ ప్రచారం చేశారు . జూనియర్  ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ ఇద్దరు అక్కకోసం ప్రచారం చెయ్యలేదు .

నందమూరి బాలకృష్ణ స్వయంగా జూనియర్ ను పిలిచినా రాలేదని , కళ్యాణ్ రామ్ ను కూడా జూనియరే  ఆపాడని బాలకృష్ణ భావిస్తున్నాడట .

ఈ కారణంగా బాలకృష్ణ జూనియర్ పేరు చెబితే మండిపడుతున్నట్టు తెలిసింది . కేటీఆర్ జూనియర్ కు ఫోన్ చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని కోరాడని , అందుకే జూనియర్  తన అక్క సుహాసిని ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదనే వార్త  బయటకు వచ్చింది . దీంతో బాలకృష్ణ జూనియర్ను ఎలాంటి పరిస్థితుల్లో “ఎన్టీఆర్ మహానాయకుడు “ఆడియో కార్యక్రమానికి పిలవడని  అంటున్నారు .

హరికృష్ణ చనిపోయిన తరువాత చంద్ర బాబు మళ్ళీ హరికృష్ణ కుటుంబ వారసులను చేరతీయాలనుకున్నాడు . ఆ ఉద్దేశ్యంతోనే సుహాసిని కి పార్టీ టికెట్ ఇచ్చి కూకట్ పల్లిలో నిలబెట్టాడు . ఎప్పుడైతే కేటీఆర్ మాట కు విలువ ఇచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదో అప్పటి నుంచి చంద్ర బాబు, బాలకృష్ణ జూనియర్ ను దూరంగా  పెట్టినట్టు తెలిసింది .

కాబట్టి బాలకృష్ణ  జూనియర్ మధ్యలో తెలంగాణ ఎన్నికలు దూరాన్ని పెంచాయని చెప్పవచ్చు .