మన్మథుడు నాగార్జున కోసం రకుల్ అందుకే ఒప్పుకుందా ?

మన్మథుడు నాగార్జున కోసం రకుల్ అందుకే ఒప్పుకుందా ?

నాగార్జున అక్కినేని , రకుల్ ప్రీత్ తో అన్నపూర్ణ స్టూడియోస్ , ఆనందీ ఆర్ట్స్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నిర్మించిన “మన్మథుడు 2” సినిమా ఆగస్టు 9న విడుదలకాబోతుంది . 2002లో నాగార్జున , సోనాలి బింద్రే తో అన్నపూర్ణ స్టూడియోస్ విజయ భాస్కర్ దర్శకత్వంలో నిర్మించిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది . ఈ సినిమా ప్రేరణతో 17 సంవత్సరాల తరువాత నాగార్జునతో నిర్మిస్తున్న ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది . ఆనాటి మన్మధుడు సినిమాతో ఈనాటి మన్మథుడు 2 పోటీపడగలడా ?

ఆనాటి “మన్మధుడు” సినిమాకు దర్శకుడు కె. విజయ భాస్కర్ తో పాటు రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్, సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ పనిచేశారు . ఆ చిత్రాల్లో నాగార్జున, సోనాలి తో పాటు అనూష కూడా నటించింది . నాగార్జున , అనూష తో రొమాంటిక్ సన్నివేశాలు అలాగే నాగార్జున , సోనాలి గిల్లి కజ్జాలు , చివరి క్లైమాక్స్ చిత్ర విజయానికి ఎంతో తోడ్పడ్డాయి . ఇక సినిమాలో పాటలు , నేపధ్య సంగీతం కూడా ప్రేక్షకులకు బాగా నచ్చాయి .

ఇప్పుడు “మన్మథుడు 2” చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కాగా కిట్టు విస్సాప్రగడ రచయిత . సంగీతాన్ని చైతన్ భరద్వాజ అందిస్తున్నారు . ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ఆనంది ఆర్ట్స్, వైకం 18 మోషన్ పిక్చర్స్ రూపొందించారు . అప్పటి మన్మధుడు సినిమా 16 కోట్లు బడ్జెట్ అయ్యింది . ఇప్పటి “మన్మధుడు 2” 50 కోట్లు పైగా అయివుండొచ్చని అంటున్నారు . అప్పటి “మన్మథుడు ” నాగార్జున వయసు 43 సంవత్సరాలు . మరి ఇప్పటి నాగార్జున వయసు 60 సంవత్సరాలు .

నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య , అఖిల్ ఇద్దరు హీరోలుగా నటిస్తున్నారు . కోడలు సమంత కూడా పలు చిత్రాల్లో నటిస్తుంది . నాగార్జున 60 సంవత్సరాల వయసులో 28 సంవత్సరాల రకుల్ ప్రీత్ తో కలర్ ఫుల్ షర్ట్ లతో నటించడం ఏమిటి ? నాగార్జున కు ఈవయసులో ఇంకా టీనేజ్ కుర్రాడిలా నటించడం అవసరమా ? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి . అయినా నాగార్జున వాటిని ఖాతరు చేయడం లేదు .

సహజంగా 60 సవత్సరాలున్న హీరోల పక్కన నటించడానికి కుర్ర హీరోయిన్లు ఆసక్తి చూపించారు . ఒకవేళ పెద్ద హీరోతో నటిస్తే యంగ్ హీరోలు తమను పక్కన పెట్టేస్తారేమో అని వారి భయం . చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , రాజా శేఖర్ , రవితేజ పక్కన కొత్త హీరోయిన్లు నటించడానికి ముందుకు రావడం లేదు అనే మాటలు వినిపిస్తున్నాయి . ఆ ఏజ్ గ్రూప్ లో వున్న నాగార్జున సరసన శృంగారం చెయ్యడాని రకుల్ ఎందుకు ఒప్పుకుంది? అంటే .. జెమిని కిరణ్ కోసం . రకుల్ ప్రీత్ ను కిరణ్ “వేంకటాద్రి ఎక్సప్రెస్ ” చిత్రం తో స్టార్ స్టేటస్ ఇచ్చాడు . అందుకే రకుల్ కు జెమిని కిరణ్ అంటే  అభిమానం . అదీకాక కిరణ్ “మన్మథుడు 2” చిత్రంలో పార్ట్నర్ . అందుకే ఒప్పుకుందని తెలిసింది . ఇక ఈ “మన్మథుడు 2” ఆగస్టు 9న విడుదల కాబోతుంది . ఈ సినిమా ఈ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి . !