సూపర్ స్టార్ మహేష్ పై సోషల్ మీడియా కౌంటర్లు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. మహేష్ నీకంటే నీతో నటించిన విలన్ బెటర్! అంటూ నెటిజనులు ఓ రేంజులోనే విరుచుకుపడుతున్నారు. అంత తప్పు మహేష్ ఏం చేశాడు? అంటే.. కాస్త వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఆగస్టు 9న తన బర్త్ డే సందర్భంగా మహేష్ చేసిన ఆ పని అభిమానులకు ఎంతమాత్రం నచ్చలేదు. సరికదా.. నీ కంటే విలన్ సోనూ సూద్ బెటర్ అంటూ ఆపోజిట్ ఫ్యాన్స్ తో పాటు క్రిటిక్స్ వ్యాఖ్యానిస్తున్నారు. సోనూసూద్ గురించి పరిచయం అవసరం లేదు. అతడు – దూకుడు- ఆగడు లాంటి చిత్రాల్లో మహేష్ కి ధీటైన విలన్ గా నటించిన సంగతి తెలిసినదే. అయితే ఇప్పుడు అనూహ్యంగా అతడు పబ్లిక్ లో రియల్ హీరో అయ్యాడు. కరోనా కష్ట కాలంలో కార్మికుల్ని క్షేమంగా ఇళ్లకు చేర్చేందుకు తనకు ఉన్న ఆస్తులన్నిటినీ ఖర్చు చేశాడు. పొరుగు రాష్ట్రం నుంచి స్వరాష్ట్రాలకు కార్మికుల్ని బస్సుల్లో పంపించాడు. విదేశాల నుంచి కష్టంలో ఉన్న పలువురిని స్వదేశాలకు రప్పించేందుకు చాలానే ఖర్చు చేశాడు. ఈ దెబ్బకు సోనూసూద్ పేరు దేశమంతా మార్మోగిపోయింది.
అయితే నిన్న మహేష్ బర్త్ డే సందర్భంగా రెండు మొక్కలు నాటి మమ!! అనిపించేయడం అభిమానుల్ని సైతం తీవ్రంగా నిరాశపరిచింది. అసలే శ్రీమంతుడు సినిమాలో డైలాగుల్ని ఎవరూ మర్చిపోలేదు. `సంపాదించినదాంట్లో కొంతయినా తిరిగిచ్చేయాలి` అంటూ క్లాస్ తీస్కున్న మహేష్ ఇలా చేస్తాడనుకోలేదు అంటూ యాంటీ ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు. కనీసం మీ విలన్ ని అయినా చూసి నేర్చుకోరా? అన్నది నెటిజనుల వెర్షన్. పుట్టినరోజున ఏదో చేస్తారు! అనుకుంటే ఇంకేదో చేశారు. మొక్కలు నాటడం మరో ముగ్గురిని నామినేట్ చేయడమేనా హీరోయిజం? అంటూ పంచ్ లు వేస్తున్నారు.
అయితే ఇక్కడ విమర్శకులు తెలుసుకోవాల్సింది చాలానే ఉంది. మహేష్ కి సోషల్ వర్క్ ఇప్పుడే కొత్తేమీ కాదు. అప్పట్లో బుర్రిపాలెంని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. పలు గ్రామాల్ని దత్తత తీసుకున్నారని పేరొచ్చింది. అలాగే ఆంధ్రా హాస్పిట్స్ తో కలిసి క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. ఇవన్నీ సేవలు కాదా? అన్నది ఫ్యాన్స్ గుర్తుంచుకోవాలి. అయితే బర్త్ డే సందర్భంగా మహేష్ ఇంకా ఏదైనా బెటర్ గా చేసి ఉంటే బావుండేదన్నది కొందరి వెర్షన్.