తమిళనాట ప్రస్తుత హాట్ టాపిక్‌గా మారిన 1000 కోట్ల టాస్మాక్ లిక్కర్ కుంభకోణంలో నటీమణి కయాదు లోహర్ పేరు వినిపించడంతో సినీ వర్గాల్లో కలకలం రేగుతోంది. టాస్మాక్ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిర్వహించిన దర్యాప్తులో ఆమె కూడా ఓ నైట్ పార్టీ సందర్భంగా రెడ్ హ్యాండెడ్‌గా కనిపించిందని వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ఈ విషయంపై ఎటువంటి ప్రకటన రాలేదు.
కయాదు ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో ఈ రూమర్లు పుట్టుకొచ్చాయి. ‘డ్రాగన్’ సినిమాతో మంచి గుర్తింపు వచ్చిన ఆమె ప్రస్తుతం తమిళ స్టార్ హీరోలు అధర్వ, జీవీ ప్రకాష్ సినిమాల్లో నటిస్తుండగా, శింబుతో కూడిన సినిమా చర్చల్లో ఉందని సమాచారం. ఇలాంటి బిజీ షెడ్యూల్ మధ్య ఈ విధమైన ఆరోపణలు రావడంతో పరిశ్రమలోనూ, ప్రేక్షకుల మధ్యనూ చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే, నెటిజన్లలో ఈ ఘటనపై మిశ్రమ స్పందనలు కనిపిస్తున్నాయి. “ఇది నిజమైతే దురదృష్టకరం” అనే వాదనలు వినిపించగా, మరికొందరు “ఇదంతా పుకారే కావచ్చు” అని భావిస్తున్నారు. ప్రస్తుతం కయాదు తరఫున ఎటువంటి స్పందన లేకపోవడం పరిస్థితిని మరింత సందేహాస్పదంగా మార్చుతోంది. నిజానిజాలు తేలే వరకు ఈ అంశంపై స్పష్టత రావడం కష్టమే. కానీ ఈ చర్చలు మాత్రం ఆమె కెరీర్‌ను ఎలా ప్రభావితం చేస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.