కొవిడ్ -19 జబ్బుతో ప్రపంచం శోకం సంద్రమవుతోంది. నానాటికి వైరస్ భారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. లక్షల్లో కేసులు.. లక్ష దాటిన మరణాలు..భారత్ లో చాప కింద నీరులా పాకిపోతున్న వైరస్ విలయం చూస్తుంటేనే భయానకంగా ఉంది. దేశంలో వేలాది రోగులతో విలయం కనిపిస్తోంది. రోజు రోజుకి మృతులు సంఖ్య పెరుగుతోంది. నిమిషాల లెక్కన మృతులను లెక్క గడుతోన్న సన్నివేశానికి చాలా దగ్గరగా ఉన్నాం. వైరస్ ముప్పు తొలగిపోయేదెలా? అంటూ ప్రజలు భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటున్నారు.
క్షణక్షణం గండంలా పరిస్థితి మారిపోయింది. కొత్త ఏరియాలో కరోనా వైరస్ సొకిందని తెలిస్తే భయం గుప్పిట్లో బ్రతకాల్సిన సన్నివేశం నెలకొంది. రెడ్ జోన్లు….ఆరెంజ్ జోన్లు…కంటైన్ మెంట్లు ఇలా రకరకాల ఆంక్షల నడుమ తెలుగు ప్రజలు నానా యాతన పడుతున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో ధైర్యం చెప్పాల్సిన టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతగా దిగజారిపోతున్నారంటే? మేము..మా ఫ్యామిలీ అన్నట్లే వ్యవరిస్తున్నారు. కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం కొందరు అవేర్ నెస్ వీడియోలు చేసారని..వాళ్లలో సామాజిక బాధ్యత ఎంత అన్నది ఇదిగో ఇలా బయటపడుతోందని విమర్శలు ఎదురవుతున్నాయి. ప్రజలంతా భయం గుప్పిట్లో బ్రతుకుతుంటే దోసె ఛాలెంజులు.. దోసకాయ ఛాలెంజ్ లు అంటూ లాక్ డౌన్ ని ఓ ఎంటర్ టైన్ మెంట్ వేదికగా మార్చేసుకున్నారని నెటిజనులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు.
ఇలా ఒకటేంటి రకరకాల ఛాలెంజ్ లు విసురుకుని ప్రజా ప్రతినిధులను కూడా పని చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని అక్షింతలు వేయించుకుంటున్నారు. ఎంతో బాధ్యతగా మెలగాల్సిన వారు వాటిని మర్చిపోయి బాధ్యరాహిత్యంగా ఉండటం ఎంత దారుణమం అంటూ! మండిపడుతున్నారు నెటిజనం. సమాజానికి ఏదైనా ఉపయోగకరమైన ఛాలెంజ్ లు చేస్తే బాగుంటుంది గానీ..ఇలా చెత్త ఛాలెంజ్ లు చేసుకుని ఎవర్నీ ఉద్దరిస్తున్నారంటూ చీవాట్లు పెడుతున్నారు. డొనేషన్లు ఇచ్చేసినంత మాత్రాన….నిత్యావసర సరుకులు పంచినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోలేదు. మీరు చేయాల్సింది చాలానే ఉంది. ప్రభుత్వాల కన్నా ఎక్కువగా చేయాల్సింది సెలబ్రిటీలే అంటూ మండిపడుతున్నారు. ప్రజలంతా మీ సినిమాలు చూస్తేనే కోటీశ్వరులయ్యారు. అందలం ఎక్కి కూర్చున్నారు అన్న సంగతి గుర్తు పెట్టుకోండి అంటూ హెచ్చరించారు. ఇక ఇప్పటికే ఆర్థికంగా డొనేషన్లు ఇచ్చిన సెలబ్రిటీలపై అంతే ఇదిగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.