శంకర్, సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్‌లో రోబో సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం ‘2.0’. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతోంది. ఈ తరుణంలో ఈ చిత్రంపై నెగిటివ్ టాక్ సోషల్ మీడియాలో మొదలైంది. ఈ సినిమా అంతా ఓ వీడియో గేమ్ లా ఉందని, శంకర్ ఏదో సందేశం చెప్దామని తడబడ్డాడని, రజనీకాంత్ నటన పేలవంగా ఉందని..ఇలా అర్దం పర్దం లేని నెగిటివ్ టాక్ కొన్ని మీడియా వెబ్ సైట్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కనపడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకిలా చివరి నిముషంలో సినిమాపై బురద జల్లుతున్నారో అర్దం కావటం లేదని అబిమానులు అంటున్నారు. వేరే స్టార్ హీరో అభిమానుల పని ఇది అని..వాళ్లే ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ కు ఓర్వలేక చివరి నిముషాల్లో ఇలా ప్రచారం మొదలెట్టారని తెలుస్తోంది. అయితే ఇదంతా తెలుగులో కాదు జరుగుతోంది. తమిళంలో..అక్కడ అరవ తంబీలు చేస్తున్న అరాచకం ఇది. అయితే సీరియస్ గా సినిమా చూద్దామనుకున్న అభిమానులు ఎవరూ ఇటువంటి కామెంట్స్ ని పట్టించుకోరు.
ఇదిలా ఉంటే సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సెల్యులర్ ఆపరేషన్స్ అసోసియేషన్ సీబీఎఫ్‌సీకి(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) లేఖ రాయడం హాట్ టాపిక్‌గా మారింది. సెల్‌ఫోన్లు, సెల్ టవర్లు మానవ జాతి మనుగడకు, పక్షులు, జంతుజాలాల జీవనానికి ప్రమాదకరమైనవిగా చిత్ర ట్రైలర్‌లో చూపించారని.. ఇది పూర్తిగా తప్పుదోవ పట్టించడమేనని సెల్యులర్ ఆపరేషన్స్ అసోసియేషన్ లేఖలో పేర్కొంది. సీబీఎఫ్‌సీ ఈ చిత్రాన్ని మరోసారి పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోరింది. అయితే.. ఈ పరిణామం చిత్ర విడుదలకు అడ్డంకిగా మారుతుందా లేక యథావిధిగా ‘2.0’ విడుదలవుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి..
‘2.0 కథ ఇదేనా? ఇంట్రస్టింగ్ గా ఉంది