“NBK 107” లో అదిరే ఐటెం సాంగ్..ఆ హాట్ సాంగ్ లెవెల్లో ఉంటుందట.!

ఇపుడు మన తెలుగు బిగ్ స్టార్స్ అంతా కూడా ఓ రేంజ్ లో తమ హావ కనబరుస్తున్నారు. ముఖ్యంగా వారిలో నందమూరి నటసింహ బాలకృష్ణ తన మాస్ కం బ్యాక్ ని “అఖండ” సినిమాతో ఇచ్చి నెక్స్ట్ లెవెల్లో అంచనాలు తర్వాత సినిమాలకు సెట్ చేసుకున్నారు.

దీనితో ఈ సినిమాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా వీటిలో దర్శకుడు గోపీచంద్ మలినేనితో బాలయ్య కెరీర్ లో 107వ సినిమా ప్లాన్ చేస్తున్నారు. దీనితో ఈ సినిమాపై మంచి అంచనాలు సెట్టవ్వగా తాజాగా ఓ క్రేజీ అప్డేట్ అయితే ఈ సినిమాపై బయటకి వచ్చింది.

మేకర్స్ ఈ సినిమాలో ఓ అదిరే ఐటెం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అయితే సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి ఆసక్తికర పోస్ట్ చేసారు. బాలయ్య 107వ ఆల్బమ్ అదిరిపోయేలా వస్తుంది అని నిన్న రాత్రి 12 గంటల సమయంలో కూడా అదే పనిలో ఉన్నాం..

ఇక ఈ సాంగ్ అయితే తమ కాంబోలో వచ్చిన అదిరిపోయే ఐటెం సాంగ్ భూమ్ బద్దలు రేంజ్ లో ఉంటుంది అని రామ్ జో క్లారిటీ ఇచ్చేసారు. అసలే ఈ సినిమాని సంగీతం థమన్ ఇస్తున్నాడు. మరి ఈ హాట్ బ్లాస్ట్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.