‘సాహో’ గురించి నాని ఏమన్నాడో చూసారా?

‘సాహో’ కి నాని సాలిడ్ సపోర్ట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్‌ అవుతున్న ఈ చిత్రంపైనే అందరి దృష్టీ ఉంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ చాలా ఆసక్తిగా ఈ సినిమా ఎలా ఉండబోతోంది..ఏ స్దాయి హిట్ ని నమోదు చేయబోతోందనే విషయమై లెక్కలు, చర్చలు చేస్తోంది. స్టార్స్ తమ సపోర్ట్ ని సాహోకు అందిస్తున్నారు. తాజాగా నాని…ఈ సినిమా హిట్ కావాలంటూ ఇది మన సినిమా అంటూ ట్వీట్ చేసారు.

‘దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన సాహో మన సినిమా. ఆ సినిమా విజయాన్ని కూడా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రభాస్‌ అన్న, సాహో టీంకు నా శుభాకాంక్షలు. గ్యాంగ్ లీడర్‌ రిలీజ్‌ డేట్‌ను రేపు ప్రకటిస్తా’ అంటూ ట్వీట్ చేశాడు.

 ఇక మొదట అనుకున్నట్లు కాకుండా సాహో రిలీజ్ డేట్‌ వాయిదా పడటం కారణంగా తెలుగు, తమిళ భాషల్లో కొన్ని సినిమాల రిలీజ్‌లు డైలామాలో పడ్డాయి. వాటిలో నాని హీరోగా తెరకెక్కుతున్న గ్యాంగ్‌ లీడర్‌ ఒకటి. తాజాగా తన సినిమా రిలీజ్ డేట్‌పై ఇలా నాని స్పందించాడు.

ప్రభాస్‌ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు రన్‌ రాజా రన్‌ ఫేం సుజిత్‌ దర్శకుడు. యూవీ క్రియేషన్స్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మందిరా బేడీ, జాకీ ష్రాఫ్‌, చుంకీ పాండే, అరుణ్‌ విజయ్‌లు కీలక పాత్రల్లో నటించారు.