అమరావతిలో నంది  అవార్డులు

చాలాకాలంగా సినిమా రంగం ఎదురు చూస్తున్న నంది అవార్డులకు కదలిక వచ్చినట్టు  తెలుస్తుంది .ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  2013 నుంచి 2016 వరకు టీవీ  నంది అవార్డులు, సినిమా అవార్డులకు కమిటీలు వేయడం అవార్డుల ఎంపిక చేయడం ప్రకటించడం కూడా జరిగింది . అయితే సినిమా నందుల విషయంలో పక్షపాతం జరిగిందంటూ కొందరు సినిమా వారు చానెల్స్ లో రచ్చ  చేశారు . దీనిపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుకు బాగా కోపం వచ్చిందని , నంది అవార్డుల పేరు ఎత్తితే మండి పడేవాడని అధికారులు చెప్పేవారు . అందుకే చాలా నెలలు దీనిపై ఎలాంటి కదలిక రాలేదు . ఈ లోపల తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి . చంద్ర బాబు బిజీ గా వున్నాడు . ఇక బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ లో వున్నాడు . ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్  అంబికా కృష్ణ ఈ విషయంలో చొరవ తీసుకొని అవార్డుల్లో కదలిక తెచ్చారని అంటున్నారు .

వచ్చే నెల 15వ తేదీన అంటే డిసెంబర్ అమరావతి లో టీవీ  నంది అవార్డుల కార్యక్రమం  ఉంటుందని, అలాగే నాలుగు సంవత్సరాల సినిమా అవార్డుల కార్యక్రమం డిసెంబర్ 29న అమరావతిలోని ఉంటుందని, ఇందుకు చంద్ర బాబు నాయుడు కూడా అంగీకరించినట్టు తెలిసింది. మొత్తానికి ఎన్నికల ముందు నందులు ఆనందంగా కదలబోతున్నాయి.