కల్యాణ్‌ రామ్‌ కొత్త సినిమా ప్రకటన

నందమూరి కల్యాణ్‌ రామ్‌ తన కొత్త చిత్రం( 17వ) ప్రకటించేశారు. రచయిత నుంచి దర్శకుడుగా మారిన సతీశ్‌ వేగేష్న దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో మెహరీన్‌ను హీరోయిన్ గా ఎంపికచేసుకున్నారు. బాలయ్యతో ఆదిత్య 369, వంశాని కొక్కడు’,‘భలే వాడివి బాసు’,‘మిత్రుడు’ వంటి సినిమాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్, ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి నిర్మిస్తున్నాడు.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తెరకెక్కించనున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందించనున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. హీరోగా కళ్యాణ్ రామ్‌కు ఇది 17వ సినిమా. నటుడిగా 20వ సినిమా. మరోవైపు కళ్యాణ్ రామ్, సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

ఇక ఈ సంవత్సరం బాబాయి బాలయ్యతో చేసిన ‘ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు ‘118’ సినిమాతో ఫ్యాన్స్ ను పలకరించాడు. వరస ఫ్లాఫ్ లతో ఉన్న కళ్యాణ్ రామ్ కు 118 చిత్రం కాస్త ఊపిరి పోసి రిలీఫ్ ఇచ్చింది. దాంతో ఇండస్ట్రీలోని దర్శకులంతా తమతో సినిమా చెయ్యమని కళ్యాణ్ రామ్ వెనకపడుతున్నారు.