నందమూరి వీరాభిమానుల కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక అమ్మాయి దిగుతోంది ?

నందమూరి కళ్యాణ్ రామ్ నుంచి సినిమా వచ్చి సంవత్సరం దాటిపోయింది. గత ఏడాది ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు సతీష్ వేగేష్న దర్శకత్వంలో ఎంత మంచి వాడవురా అన్న సినిమా చేశాడు. 2020 సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఆ తర్వాత మళ్ళీ సినిమా రాలేదు. కాగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి మాత్రం ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్ ని ఇవ్వలేదు. ఈ సినిమా తో మల్లిడి వేణు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

 

ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో ఎన్.టి.ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. శరవేగంగా టాకీపార్ట్ కంప్లీట్ చేస్తున్న ఈ సినిమాలో ఒక అద్భుతమైన ఐటెం సాంగ్ ఉందట. ఈ సాంగ్ ని త్వరలో చిత్రీకరించేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ఐటెం సాంగ్ కి అఫ్ఘనిస్థాన్ కు చెందిన హాట్ బ్యూటీ వారిన హుస్సేన్ ని టాలీవుడ్ కి తీసుకు రానున్నట్టు తాజా సమాచారం. బాలీవుడ్ లో వారిన హుస్సేన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఈ మధ్య మన తెలుగు సినిమాలలో ఐటెం సాంగ్స్ కి గాని సినిమాలలో గాని బాలీవుడ్ బ్యూటీస్ నే తీసుకు వస్తున్నారు.

ఈ క్రమంలోనే బాలీవుడ్ లో హీరోయిన్ గా నటిస్తున్న వారిన హుస్సేన్ కళ్యాణ్ రామ్ సినిమాతో టాలీవుడ్ కి తీసుకురావాలని ట్రై చేస్తున్నారట. ఇక ఈ సాంగ్ చేసేందుకు రెమ్యూనరేషన్ కూడా బాగానే ముట్టచెబుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ రావణుడి తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం. సోషియో ఫాంటసీ తరహ కథతో రూపొందుతున్న ఈ సినిమాకు రావణ అన్న టైటిల్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తుండగా త్వరలో టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం.