నటసార్వభౌమ ఎన్. టీ రామారావు జయంతి నేడు. ఆయన అభిమానులకు, తెలుగు తమ్ముళ్లకు ప్రత్యేకమైన రోజుది. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ప్రతీ ఏడాది పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు విచ్చేసి నివాళు అర్పించడం ఓ అనవాయితీగా చేస్తుంటారు. అంతకు ముందు నందమూరి కుటుంబంలో ప్రతీ సభ్యుడు తాతయ్య ఘాట్ కు నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆ కుటుంబం నుంచి ఎవ్వరూ మిస్ కారు. వీలున్న ప్రతీ ఒక్కరూ హాజరై తాతయ్యను స్మరించుకుంటారు. విదేశాల్లో ఎక్కడున్నా మే 28వ తేదికి మాత్రం ప్రతీ సభ్యుడు హైదరాబాద్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటారు.
ఇది దశాబ్ధాలుగా చేస్తోన్న కార్యక్రమం కాబట్టి దాదాపు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే ఈ ఏడాది అన్నదమ్ములు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రం తాతయ్య జయంతి వేడుకల్ని స్కిప్ కొట్టారు. లాక్ డౌన్ నేపథ్యం..కొవిడ్ కారణంగా బయటకు రాలేమని ఇంట్లో నుంచే తమ నివాళులు అర్పిస్తామని తెలిపారు. వీరిద్దరికీ సంబంధించి పీఆర్ వ్యవహారాలు చూసే మహేష్ కొనేరు ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే తాతయ్య వేడుకల్ని ఈ బ్రదర్స్ ఎప్పుడు మిస్ కారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సిట్యువేషన్ లో ఉన్నా! తప్పకుండా ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించేవారు. కానీ ఈసారి హైదరాబాద్ సిటీలో ఉన్నా హాజరు కాకపోవడం అన్నది ఆశ్చర్యంగానే అనిపిస్తోంది.
సెక్యురిటీ సమస్య, అభిమానులు గుమ్మికూడే అవకాశం కూడా లేదిప్పుడు. బ్రదర్స్ ఇద్దరు సైలెంట్ గా విచ్చేసి నివాళులు అర్పించి వెళ్లిపోవచ్చు. కుటుంబం విషయంలో వ్యక్తిగతంగా ఎలాంటి విషయాలు ఉన్నా..తాతయ్య జన్మదినాన్ని ఎప్పుడూ ఇలా కానిచ్చేయలేదు. కానీ ఈసారి కొవిడ్ పేపేరు చెప్పి స్కిప్ కొట్టేసారు. అయితే ఇలా స్కిప్ కొట్టడానికి కొవిడ్డే కారణమా? లేక అంతకుమంచి వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. కుమారుడు, నటుడు, హిందుపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈరోజు ఉదయమే ఘాట్ కు చేరుకుని నివాళులు అర్పించి..ఆన్ ది వేలో కనిపించిన ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి వెళ్లారు. అలాగే కొవిడ్ పేరు చెప్పి మిగతా సినిమా వాళ్లంతా సెలైంట్ గా ఉన్నారా? అంటే అదీ లేదు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. ఇటీవలే చిరంజీవి తన సినిమా వర్గాన్ని వెనకేసుకొచ్చి భౌతికదూరం పాటిస్తూ తలసాని, కేసీఆర్ తో భేటి అయిన సంగతి తెలిసిందే.