(సూర్యం)
మీటూ ఉద్యమం బాలీవుడ్ కే పరిమితం కావటం లేదు. కన్నడ,తమిళ పరిశ్రమలలో వారిని కూడా ఊపేస్తోంది. ఎప్పుడు ఎవరి మీద ఆరోపణ వస్తుందా అని అని భయపడే స్దితికి చేరుకుంది. ఈ నేపధ్యంలో కన్నడ నటి సంజన నోరు విప్పి మీటూ అంటూ ఆరోపణలు చేసింది. ప్రభాస్ సరసన బుజ్జిగాడు మేడిన్ చెన్నైలో నటించిన ఆమె తను చిన్న వయస్సులోనే లైంగిక వేధింపులకు గురి అయ్యానని చెప్తోంది. అయితే ఆమె మాటలను
సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. మర్డర్ లాంటి సెక్స్ ఓరియెంటెడ్ సినిమా రీమేక్ లో చేసేటప్పుడు నాపై ఆశ్లీల సన్నివేశాలు షూట్ చేసారని ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు.
అసలు సంజన ఏమందో.. ఆమె మాటల్లో చూద్దాం. నేను 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టాను. అప్పుడు ప్లస్‌ఒన్ చదువుతున్నాను. ఆ సమయంలో సినిమాల్లో నటించి మళ్లీ చదువుకోవచ్చుననే ఆలోచనతో వచ్చాను. తొలి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు హిందీ చిత్రం మర్డర్‌ను చూపించి దీన్నే కన్నడంలో రీమేక్ చేస్తున్నామని చెప్పారు. అందులో పలు అశ్లీల సన్నివేశాలు చోటు
చేసుకోవడంతో నేను నటించనని చెప్పాను. అందుకా దర్శకుడు మర్డర్ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులకు తగ్గట్టుగా పలు మార్పులు చేస్తున్నట్లు చెప్పడంతో అందులో ఒక్క ముద్దు సన్నివేశంలో నటించడానికి మాత్రం నేను అంగీకరించాను.
చిత్ర షూటింగ్ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్ వెళ్లడానికి అంగీకరించిన దర్శకుడు అక్కడకు వెళ్లిన తరువాత అమ్మను షూటింగ్ స్పాట్‌కు రావొద్దని
చెప్పారు. అక్కడ నాతో పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయగా మేము చెప్పినట్లు చేయకుంటే నీ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరించారు.
అలా ఎన్నో కలలతో వచ్చిన చిన్న పిల్లనైన నన్ను వారు ఇష్టానికి వాడుకున్నారు అని నటి సంజనా గల్రాణి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె ఆవేదన కరెక్టే కానీ…మర్డర్ లాంటి సినిమా లో చేసినప్పుడు ఇలాంటి మాట్లాడటానికి అవకాసం ఉండదని సోషల్ మీడియా జనం అంటున్నారు. అయితే ఎవరి ఆరోపణ అయినా కామెడీ చేయటం మాత్రం తగదు.