శృంగార పురుషుడిగా నాగ‌శౌర్య‌

యంగ్ హీరో నాగ‌శౌర్య కు ఛ‌లో త‌ర్వాత స‌రైన హిట్టు ప‌డ‌లేదు. న‌ర్త‌న‌శాల‍ క‌ణం లాంటి వ‌రుస‌ ప్ర‌యోగాలు చేసినా ఫ‌లితం ఆశించిన‌ట్టుగా రాలేదు. దీంతో స‌క్సెస్ త‌ప్ప‌నిస‌రి అయింది. ప్ర‌స్తుతం యువ ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ నేతృత్వంలో అశ్వ‌థ్థామ చిత్రంలో న‌టిస్తున్నాడు. కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌ల‌ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న చిత్ర‌మిది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్.. ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స‌స్పెన్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా మ‌లిచార‌ని ట్రైల‌ర్ చెబుతోంది. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సినిమా త‌ర్వాత నాగ‌శౌర్య ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచేస్తాడు? అంటే..తాజాగా ఆస‌క్తిక‌ర సంగతులే తెలిసాయి. త‌న‌కు హీరోగా తొలి స‌క్సెస్ ని అందించిన‌ శ్రీనివాస్ అవ‌స‌రాల‌తో క‌లిసి హ్యాట్రిక్ పై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన ఊహ‌లు గుస‌గుస‌లాడే- జ్యో అచ్యుతానంద చిత్రాలు చ‌క్క‌ని విజ‌యాలు సాధించిన సంగ‌తి తెలిసిందే. యూత్-ఫ్యామిలీ ఆడియ‌న్స్ కి ఈ చిత్రాలు బాగా క‌నెక్ట్ అయ్యాయి. అయితే ఈసారి ఈ జోడీ ఓ పెద్ద సాహ‌సానికే తెర‌లేపారు.

నాగ‌శౌర్య త‌న స్వ‌భావానికి విరుద్ధంగా శృంగార పురుషుడి పాత్ర‌లో న‌టించ‌నున్నాడ‌ని.. ఇప్ప‌టికే అవ‌స‌రాల స్క్రిప్టుని సిద్దం చేసాడని తెలుస్తోంది. వ‌య‌సులో ఉన్న‌ అమ్మాయిల‌తో ఓ కుర్రాడు త‌న కోర్కెలు ఎలా తీర్చుకున్నాడు? అన్న ఆస‌క్తిక‌ర పాయింట్ ను ఎంచుకుని ర‌క్తి క‌ట్టించే స్క్రిప్ట్ నే సిద్దం చేసాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఒక్కో ద‌శ‌లో వివిధ వ‌య‌సుల్లో ఓ కుర్రాడికి శృంగారం ప‌ట్ల ఉన్న ఆస‌క్తిని తెర‌పై ఎలివేట్ చేయ‌బోతున్నాడ‌ని తెలిసింది. త్వ‌ర‌లోనే సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్ల‌నుంది. హైద‌రాబాద్ లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు స‌హా ఓపాటను చిత్రీక‌రించి యూనిట్ అమెరికా ప‌య‌నం కానుందిట‌. అక్క‌డే శృంగార స‌న్నివేశలు తెర‌కెక్కించ‌నున్నారని తెలుస్తోంది. శౌర్య శృంగారంలో వీక్ అంటూ స‌మంత (ఓ బేబి పెయిర్) కామెంట్ చేసిన త‌ర్వాత శౌర్య ఇలాంటి స్క్రిప్టును ఎంచుకోవ‌డం యాథృచ్ఛిక‌మేనేమో తెలియాల్సి ఉంది.