ఏందయ్యో ఇది.. మరీ ఇంత కష్టపడుతున్నాడేంటి?

Naga shourya workout For NS20 Movie

ఊహాలు గుసగుసలాడే వంటి కూల్ ఎంటర్టైనర్‌తో ఇండస్ట్రీకి పరిచయమై.. దిక్కులు చూడకు రామమయ్య, జో అచ్యుతానంద వంటి మంచి సినిమాల్లో నటించిన నాగశౌర్య ప్రస్తుతం రూట్ మార్చాడు. ఎప్పుడూ అలాంటి సినిమాలేనా? కాస్తైనా భిన్నంగా ఉండాలి కదా అని ఆలోచిస్తున్నాడు. ఆక్రమంలో ఆలోచించి చేసిన సినిమాయే అశ్వథ్థామ. అయితే అది నిర్మాతగా, హీరోగా మిశ్రమ ఫలితాన్నే ఇచ్చింది నాగ శౌర్యకు. అయినా సరే కొత్తదనం ఉన్న చిత్రాలనే ఓటు వేస్తున్నాడు.

Naga shourya workout For NS20 Movie
Naga shourya workout For NS20 Movie

ఆ కోరికతోనే ఓ ప్రాచీన క్రీడా నేపథ్యంలో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. నాగశౌర్య 20వ చిత్రానికి సంబంధించిన పోస్టర్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నాగ శౌర్య టెన్ ప్యాక్స్‌ను ట్రై చేస్తున్నాడు. అయితే ఇది దర్శకుడు చెప్పలేదట. తనకు తాను తీసుకున్న నిర్ణయమేనట. సినిమా కథలో స్పోర్ట్స్ మెన్ కాబట్టి ఆ మాత్రం ఫిట్నెస్ ఉండాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడట.

లాక్ డౌన్ విధించిన నాలుగు నెలల్లో ఎవ్వరినీ కలవకుండా, కథలు వినకుండా కేవలం జిమ్ సెంటర్‌కే పరిమితం అయ్యాడట. మొత్తానికి ప్రస్తుతం ఎనిమిది పలకలు వచ్చాయట. ఇంకో రెండింటి కోసం ప్రయత్నం చేస్తున్నాడట. అందులో భాగంగానే జిమ్‌లో తెగ కష్టపడుతున్నాడట. వీటికి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. జిమ్‌లో నాగశౌర్య చేస్తోన్న వర్కౌట్లకు ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందే. అయితే ఇంతలా కష్టపడుతున్న నాగశౌర్యకు ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.