రష్మిక ఫ్యాషన్, అందానికి గూగుల్ తల్లి కూడా ఫిదా అయ్యి జీవితాంతం గుర్తుండేలా ఒకటి ఇచ్చేసింది

rashmika selected as 2020-google national crush of india
rashmika-mandana
rashmika-mandana

అదృష్టం అంటే రష్మికాదే అని చెప్పుకోవాలి, ఛలో అనే చిన్న మూవీ తో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ గీత గోవిందంతో ఫేట్ మారిపోయిందని చెప్పుకోవాలి. ఆ మూవీ ఎంత పెద్ద సూపర్ దూపేరే హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అదృష్టం కలిసొచ్చిన ఈ హీరోయిన్ అనతికాలంలోనే స్టార్ హీరోలస సరసన జోడిగా ఆఫర్స్ కొట్టేసింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ సరసన సిల్లీ క్యారెక్టర్ లో క్యూట్ గా నటించేసి బాగా ఫెమస్ అయ్యింది. తర్వాత భీష్మ తో సాలిడ్ హిట్ కొట్టిన రష్మిక అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించబోతుంది. చాలా తక్కువ సమయంలోనే ఫెమస్ అయిన రశ్మికకి గూగుల్ కూడా ఫిదా అయ్యింది.

rashmika selected as 2020-google national crush of india
rashmika selected as 2020-google ‘national crush of india’

2020 వ సంవత్సరానికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక ఎన్నికైనట్టు గూగుల్ ప్రకటించింది. రష్మిక ఫ్యాషన్ స్టయిల్ వలనే రష్మికాని ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా గుర్తించినట్టుగా సమాచారం. ఇప్పటివరకు నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా ఎంపికైన వారిలో దిశా పటాని , ప్రియా ప్రకాష్ వారియర్ , మానుషి చిల్లర్ లు మాత్రం ఉంటే… ఇప్పుడు ఈ ఘనత కన్నడ, తెలుగు భషాల్లో మాత్రమే నటించిన రష్మికకి కూడా దక్కడం మాత్రం ఒకింత షాక్ గా ఉన్నా కూడా ఆనందించాల్సిన విషయమే. రష్మిక నటించిన చాలా చిత్రాలు హిందీ అండ్ తమిళ్ లో కూడా డబ్ అవడంతో రష్మిక కి ఇంత క్రేజ్ వచ్చింది అని.. అందుకే అందరిని వెనక్కి నెట్టి రష్మిక ఈ 2020- గూగుల్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా ఘనత సాధించినట్టుగా చెబుతున్నారు.

rashmika-mandana
rashmika-mandana