ఆ హీరో అంటే ఎన్టీఆర్ భార్యకి ఎంతో ఇష్టమట.. ఎవరో తెలుసా?

టాలీవుడ్ నందమూరి హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఇటీవల విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మనందరికీ తెలిసిందే. నందమూరి ఫ్యామిలీ కోడలిగా ఎన్టీఆర్ సతీమణిగా బాధ్యతలను చేపడుతూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు అలాగే తన పిల్లలకు సంబంధించిన వీడియోలను ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది.

అంతేకాకుండా లక్ష్మీ ప్రణతి ఎక్కువగా బయట కనిపించదు. ఫంక్షన్లకు సందర్భాన్ని బట్టి ఆమె అప్పుడప్పుడు బయట కనిపిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాను జపాన్ లో విడుదల చేస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ తో కలిసి లక్ష్మీ ప్రణతి కూడా జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ దంపతులతో పాటు రామ్ చరణ్ దంపతులు, రాజమౌళి దంపతులు అలాగే రాజమౌళి కొడుకు కూడా హాజరయ్యారు. ఇది ఇలా తాజాగా సోషల్ మీడియాలో లక్ష్మి ప్రణతికి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఒక స్టార్ హీరోకి భార్య అయిన లక్ష్మీ ప్రణతి మరొక హీరోకి వీరాభిమాని అని తెలుస్తోంది.

అయితే లక్ష్మీ ప్రణతి అభిమానిస్తున్న ఆ హీరో మరెవరో కాదు నాగశౌర్య. హీరో నాగశౌర్యకి లక్ష్మీ ప్రణతి వీరాభిమాని అని వార్తలు వినిపిస్తున్నాయి. నాగశౌర్యకి సంబంధించిన పాటలు సినిమాలు ఏది విడుదల అయినా కూడా మిస్ అవ్వకుండా వాటిని తప్పకుండా చూస్తుందట లక్ష్మీ ప్రణతి. అంతేకాకుండా నాగ శౌర్య సినిమాకు సంబంధించిన పాటలు ఏవైనా నచ్చితే వెంటనే వాటిని కాలర్ ట్యూన్ గా కూడా పెట్టుకుంటుందట.