తెలుగు తెరపై సిక్స్ ప్యాక్ బాడీని ప్రదర్శించింది అల్లు అర్జున్. దేశ ముదురు సినిమాతో మొదలైన ఈ ట్రెండ్.. నేటికీ కొనసాగుతోంది. అయితే సిక్స్ ప్యాక్ నుంచి ఎనిమిది ప్యాక్‌లకు వచ్చింది. కొందరు హీరోలు ఆరు పలకల దేహాన్ని ప్రదర్శించేందుకు ఉత్సాహాని ప్రదర్శింస్తుంటారు. కానీ ఈ యంగ్ హీరో నాగశౌర్య మాత్రం ఏకంగా పది పలకల దేహం కోసం శ్రమిస్తున్నాడట. ఈ మధ్యే తన కొత్త సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
నాగశౌర్య టెన్ ప్యాక్స్ కోసం ట్రై చేస్తున్నాడనే వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. అసలే వరుస ఫ్లాపులతో కసి మీదున్నాడు. సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్‌లో చేసిన రెండు చిత్రాలు (నర్తన శాల, అశ్వథ్థామ) బోల్తా కొట్టడంతో నిరాశపడ్డాడు. అన్నింటికి మించి అశ్వథ్థామపై ఎంతో నమ్మకం పెట్టుకోవడం, పచ్చబొట్టుకూడా పొడిపించుకోవడం అందరికీ తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం అశ్వథ్థామ బెడిసికొట్టింది.
ప్రస్తుతం నాగశౌర్య తన 20వ చిత్రం కోసం కఠోర శ్రమ చేస్తున్నాడు. ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఏకంగా పది పలకల దేహం కోసం ప్రయత్నిస్తున్నాడట. ఇందుకోసం కఠినమైన నియమాలు, ఆహార పద్దతులను అవలంభిస్తున్నాడట. మరి ఈ చిత్రమైనా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. ఇది కాకుండా నాగ శౌర్య అవసరాల శ్రీనివాస్‌తో మరో ఫీల్ గుడ్ లవ్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు.