ఇటీవలి కాలంలో బాలీవుడ్ ని వరుస మరణాలు వేధిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ మధ్య టాలీవుడ్ లో కొనసాగిన మృత్యుఘోష అటుపై బాలీవుడ్ కి తాకింది. వరుస మరణాలతో బాలీవుడ్ కి ఊపిరాడనంత పనైంది. వయసుతో సంబంధం లేకుండా మరణ మృదంగా మ్రోగుతోంది. వృధాప్యం కారణంగా కొందరు తనవు చాలిస్తే…ఆకస్మిక మరణాలతో ఇంకొంత మంది సెలబ్రిటీలు మృత్యుఒడిలోకి జారుకున్నారు. దిగ్గజ నటులు ఇర్పాన్ ఖాన్, రీషీకపూర్, పాపులర్ యంగ్ సింగర్, నటుడు అర్జున్ కనుంగో తండ్రి, ప్రముఖ నిర్మాత – టెలివిజన్ అండ్ గిల్డ్ ఆఫ్ ఇండియా సీఈవో కుల్మీత్ మక్కర్, బాలీవుడ్ ప్రఖ్యాత గీత రచయిత అన్వర్ సాగర్ సహా యువ కాస్టింగ్ డైరెక్టర్ క్రిష్ కపూర్ వంటి వారు అసువులు బాసడం బాలీవుడ్ కి తీరని లోటు.
ఈ మరణాలన్ని సహజంగా సంభవించడం ఒక ఎత్తైతే యువ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడం పరిశ్రమలో మరో ఎత్తు అయింది. సుషాంత్ మరణంపై ఎన్నో అనుమానాలు? కేసుల నేపథ్యంలో బాలీవుడ్ ఒక్కసారిగా అట్టుడికిపోయింది. వీరంతా గత మూడు నాలుగు నెలల కాలంలోనే వరుసగా అనంతలోకాలకు ఎగసారు. ఇలా టాప్ సెలబ్రిటీలంతా ఒక్కసారిగా చనిపోవడంతో బాలీవుడ్ పరిశ్రమ ఉలిక్కి పడింది. బాలీవుడ్ లో అసలేం ఏం జరుగుతుందో? అర్ధం కాని సన్నివేశం ఎదురైంది. ఇదే తరహా మరణాలు ఓ ఏడాది టాలీవుడ్ లో చోటు చేసుకున్నాయి. ఆ సెలబ్రిటీలందరి మరణాలు ఊహించనవే. దీంతో టాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. ఎప్పుడూ లేని వరుస మరణాలతో టాలీవుడ్ సెలబ్రిటీలంతా భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో పరిశ్రమ పెద్దలు పూనుకుని మృత్యుంజయ యాగం లాంటివి చేసారు. ఈ యాంగంలో సెలబ్రిటీలందరూ పాల్గొన్నారు. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం సాక్షిగా ఈ యాగాలు నెల రోజుల పాటు సాగాయి. ఆ తర్వాత ఆ యాగాల ఫలితం ఉందని పలువురు సెలబ్రిటీలు అభిప్రాయపడ్డారు. తాజాగా బాలీవుడ్ పెద్దలు ఇలాంటి యాగాలకు సన్నద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అక్కడ యాగాలు వాళ్ల సంస్కతి, సంప్రదాయాల ప్రకారం చేయాల్సి ఉంటుంది. బాలీవుడ్ హీరోల మతాలు వేరు. అక్కడ అన్ని మాతాల హీరోలున్నారు. ఈ నేపథ్యంలో అన్ని మాతాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఇది అక్కడ సాధ్యపడుతుందా? అన్నది చూడాలి.