Naga Chaitanya-Sobhita: అక్కినేని హీరో నాగచైతన్య అలాగే హీరోయిన్ శోభితలు గత రెండేళ్లుగా ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. అయితే వీరు ప్రేమలో ఉన్నారంటూ వీరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉందంటూ ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ వార్తలపై అటు నాగ చైతన్య కానీ ఇటు శోభిత కానీ స్పందించలేదు. ఇది గత నెల నవంబర్లో ఈ జంట సింపుల్గా ఎంగేజ్మెంట్ వేడుకతో ఒకటి అయ్యి ఆ వార్తలు నిజమే అని చెప్పకనే చెప్పేసారు. అయితే ఇటీవల ఎంగేజ్మెంట్ వేడుకతో సగం భార్యాభర్తలు అయినా నాగచైతన్య శోభితలు తాజాగా మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
డిసెంబర్ 4వ తేదీన ఈ జంట పెళ్లి అతి కొద్ది మంది సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు నేడు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అయిన విషయం విషయం తెలిసిందే. అక్కినేని, దగ్గుబాటి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వివాహానికి పలువురు టాలీవడ్ సినీ ప్రముఖులు కూడా వచ్చారు. మరి ఈ నవ వధూవరులను ఆశీర్వదించడానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హాజరయ్యారు అన్న విషయానికి వస్తే.. తమిళ స్టార్ హీరో కార్తీ ఈ పెళ్లికి హాజరయ్యారు. ఫ్లవర్ బొకే ఇచ్చి నవ వధువు వరులకు కంగ్రాట్స్ తెలిపారు.
అలాగే నాగార్జున క్లోజ్ ఫ్రెండ్స్ అయినా మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యి నవవధువు వరులను ఆశీర్వదించారు. వీరితో పాటుగా వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి , సుహాసిని, కీరవాణి ఇంకా కొంతమంది సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మాత్రమే వైరల్ గా మారాయి. అలాగే కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీరితో పాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు వచ్చినట్టు తెలుస్తోంది.