విజయ్ సేతుపతి తో ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ !

జీవిత కథ చిత్రాల‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో ప‌లువురు స్పోర్ట్స్ ప‌ర్స‌నాలిటీస్ జీవిత నేప‌థ్యంలో సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. ఇక తాజాగా శ్రీలంక స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ జీవిత నేప‌థ్యంలోను సినిమా చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేసుకుంటున్నారు.బాల్ కి భయం మురళీధరన్ అంటే అతిశయోక్తి లేదు.

ఈ బయోపిక్‌లో ముత్తయ్యగా విజయ్‌ సేతుపతి నటించబోతున్నారు. శ్రీపతి రంగస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి 800 అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌లో ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్స్ సాధించ‌గా, ఆ నెంబ‌ర్‌తోనే సినిమా రూపొంద‌నుంద‌ని అంటున్నారు .

ముత్తయ్య మురళీధరన్‌ తమిళ సంతతికి చెందిన స్పోర్ట్స్‌ పర్సన్ కాగా, ఆయ‌న పాత్ర‌లో న‌టించడం స‌వాల్ లాంటిద‌ని విజ‌య్ అంటున్నారు. ఈ చిత్రాన్ని థార్‌ మోషన్‌ పిక్చర్స్‌ నిర్మించనుంది.