బిగ్ బాస్ సీజన్ 4తో ఫుల్ క్రేజ్ దక్కించుకున్న సింగరేణి బిడ్డ సోహెల్. టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగి ఉన్న సోహెల్ టైటిల్ వద్దనుకొని రూ. 25 లక్షల రూపాయాలతో బయటకు వచ్చాడు. ఆ మొత్తంలో పది లక్షలు చారిటీకు ఇస్తానని చెప్పి అందరి మనసులు గెలుచుకున్నాడు సోహెల్. నోరు ఎక్కువ కాని మనసు మాత్రం వెన్న అని గ్రహించిన ప్రేక్షకులు అతనిని సొంతింటి మనిషిలా భావించారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సోహెల్ కోసం తన శ్రీమతి సురేఖతో బిర్యానీ చేపించి మరీ పంపించాడు. అంతేకాదు సోహెల్ చేయబోవు సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
వంద రోజులకు పైగా బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్న సోహెల్ బయటకు వచ్చాక ఆయన కథ పూర్తిగా మారింది. వరుస ఇంటర్వ్యూలు, ర్యాలీలు, వేడుకలు ఇలా క్షణం తీరికలేకుండా గడుపుతున్నాడు. ఇక రీసెంట్‌గా ప్రాజెక్ట్ కూడా ప్రకటించాడు. మైక్ మూవీ పతాకంపై రూపొందుతున్న చిత్రాన్ని శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించనుండగా, అప్పిరెడ్డి నిర్మిస్తున్నారు. మరి కొన్ని సినిమాలు కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
అయితే కరీంనగర్ జిల్లా ప్రాంతవాసిగా తనకు కరీంనగర్, సింగరేణి ప్రాంతాలపై సినిమా రూపొందించాలని ఉందని సోహెల్ అన్నారు. అవకాశం వస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని బిగ్‌బాస్ ఫేం సోహెల్ చెప్పడం విశేషం.కరీంనగర్‌లోని ఒక హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాన్నితెలియజేశారు సోహెల్ చెప్పిన ఈ మాటకు అభిమానులతో పాటు సింగరేణి కార్మికులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నప్పుడు సోహెల్ చాలా సార్లు సింగరేణి బిడ్డ అంటూ గట్టి గట్టిగా అరిచిన సంగతి తెలిసిందే.