లాక్ డౌన్ అనంతరం ప్రేక్షకులు అన్ని భయాలను పక్కనపెట్టి సినిమా థియేటర్లకు వస్తున్నారు. ప్రభుత్వం వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు ఇచ్చింది. ‘క్రాక్, నాంది’ లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సినిమాలు వచ్చినా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. గత వారం అరడజను ఈ వారం 10 వరకు చిన్న సినిమాలు వచ్చాయి. గత వారం సినిమాలన్నీ నిరాశపరచగా ఈరోజు విడుదలైన సినిమాల్లో ‘ఏ 1 ఎక్స్ ప్రెస్’ ఒక్కటి పర్వాలేదనిపించగా మిగతావన్నీ కనీసం టాక్ కూడ బయటకు రానంతగా మూలాన పడ్డాయి.
చాలా చోట్ల కొన్ని సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడ లేవు. టికెట్లు అమ్ముడుపోక డిస్ట్రిబ్యూటర్లు షోలను క్యాన్సిల్ చేసుకున్న సినిమాలు కూడ ఉన్నాయి. వీటి మూలాన ఇప్పుడిప్పుడే థియేటర్లకు అలవాటుపడుతున్న ప్రేక్షకులు నీరసపడిపోయే ప్రమాదం ఉంది. బ్యాక్ టు బ్యాక్ మంచి సినిమాలు వస్తుంటే ఆడియన్స్ కూడ రిలాక్స్ ఫీలవుతారు. ధైర్యం చేసి సినిమాహాళ్ళకు వచ్చినందుకు మంచి సినిమా చూశామని శాటిసిఫై అవుతారు. అలా కాకుండా నెలకు ఒకటో రెండో మంచి సినిమాలు పది మిగతా 10 సినిమాలు నెత్తి మీద మొత్తినట్టు ఉన్నాయి.
ఇలాంటి సినిమాల మూలాన ఇంతా చేసి థియేటర్లకు వచ్చింది ఇలాంటి సినిమాలు చూడటానికా అనే నిరుత్సాహంగా కలగొచ్చు ప్రేక్షకుల్లో. అందుకే పవన్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ లాంటి టైర్ వన్ హీరోల సినిమాలు నెలకొకటి అయినా వస్తే ప్రేక్షకులు రిలాక్స్ ఫీలవుతారు. థియేర్లకు రావడం మానుకోరు. ఆ ఊపులో చిన్న చిన్న సినిమాలు కూడ సర్వైవ్ అవ్వగలవు. కాబట్టి పెద్ద హీరోలు ఎంత త్వరగా మేలుకుని సినిమాలు రిలీజ్ చేస్తే అంత మంచిది.