బిగ్ బాస్ తమిళ్ మూడో సీజన్‌లో గ్లామరస్ క్వీన్‌గా పేరు సంపాదించింది సాక్షీ అగర్వాల్. ఈ భామ సినిమాల్లోనూ బాగానే ఫేమస్. అయితే మెయిన్ లీడ్ క్యారెక్టర్లు మాత్రం ఇంత వరకు చేయలేదు. కూతురిగా, కోడలిగా ఇలా సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చింది. ఇక బిగ్ బాస్ షోతో సాక్షి అగర్వాల్ ఫేట్ మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి లెక్కలేనంత ఫాలోయింగ్ ఏర్పడింది. అలా షో ద్వారా వచ్చిన క్రేజ్‌ను సోషల్ మీడియా ద్వారా నిలబెట్టుకుంటోంది.
సాక్షి అగర్వాల్ చిన్నతనంలో మరీ లావుగా ఉండేదట. అందరూ చబ్బీ, బొండాం, సోడా బుడ్డి ఇలా రకరకాలుగా పిలిచి వేధించేవారట. ఆ సమయంలో సాక్షి చదువుల పురుగులా ఉండేదట. అందంపై ఏమాత్రం శ్రద్ద కూడా చూపెట్టేది కాదట. అయితే అందరూ అలా ఎగతాళి చేసినందుకు తాను ఈ రోజు ఇలా ఇంతటి స్థాయిలో నిలబడ్డాడని, తనను వెక్కరించిన వారందరికీ ఎంతో రుణ పడి ఉంటానని ఆ మధ్య పెద్ద వ్యాసమే రాసుకొచ్చింది.
సాక్షి అగర్వాల్ కాలా సినిమాలో రజినీకాంత్ కోడలిగా నటించింది. కాలా సినిమాతో సాక్షికి గుర్తింపు లభించింది. అయితే సాక్షి అందాలు చూడాలంటే మాత్రం ఆమె సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. చీర కట్టినా మోడ్రన్ డ్రెస్ వేసినా ఫిదా అవ్వాల్సిందే. రీసెంట్‌గా సాక్షి తన అమ్మ చీర కట్టుకుందట. అందులోనూ సాక్షి తన ప్రత్యేకతను చాటుకుంది. పైటను కాస్త మడిచి సన్నగా చేయడంతో.. అందాలన్నీ బయటపడ్డాయి. ఎద అందాలు, నాభి అందాలు కనిపించడంతో కుర్రాకురుకు పిచ్చెక్కిపోతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.