ఒక నటుడి ఆత్మహత్యతో ఎన్ని ప్రకంపనాలు… ఎవరూ ఊహించని ఎన్నో నిజాలు సాక్షాత్కరిస్తున్నాయి. … ఇది దేశంలోనే ఎంతో సంచలనమైన కఠోర వాస్తవిక విషయం. ఇది ఆత్మహత్యనా.. హత్యనా? అన్నది తేలలేదు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణించి ఇప్పటికే నెలరోజులు పైగానే అయ్యింది. ఇంకా ఎన్నో సందేహాలు ప్రజల్ని వెంటాడుతున్నాయి. ఇప్పటికీ సుశాంత్ కుటుంబ సభ్యులకే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. పోలీస్ దర్యాప్తులో ఎలాంటి నిజాలు నిగ్గు తేలడం లేదు. ప్రతిదీ అనుమానాస్పదమే.
ముంబై మాఫియానే ఈ పని చేసిందా? ప‌్రియురాలు రియా చక్రవర్తి వెనక ఉండి పెద్దలు నాటకాలాడారా? ఈ కేసును పోలీసులే తప్పు దోవ పట్టిస్తున్నారా? అందుకు వారికి ఏదైనా ముట్టిందా? ఇలా నెటిజనులు ఎన్నో ఎన్నో సందేహాల్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కంగన సహా పలువురు స్టార్లు సైతం సందేహాలు వ్యక్తం చేస్తూ వేడెక్కించేస్తున్నారు.
మరి ఇలాంటి కీలకమైన కేసులో సుశాంత్ స్వస్థలం బీహార్ లో నమోదైన కేసును ఛేదించేందుకు ముంబై కి వచ్చిన బిహారీ పోలీసులకు ఎలాంటి పరాభవం జరిగిందో తెలుసా? ఇక్కడికి వచ్చిన బిహారీ పోలీసులకు కనీసం వాహనం అయినా ఏర్పాటు చేయలేదట. ఫలితంగా 3 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లారు. అట్నుంచి ఎవరినైతే విచారించారో ఆమె ఇచ్చిన లగ్జరీ కార్ లో తిరిగి గమ్య స్థానానికి రావాల్సిన దుస్థితి ఎదురైంది.
దీనిని ఏమని అనాలి? ముంబై పోలీస్ వర్సెస్ బీహార్ పోలీస్ అని అనుకోవాలా? లేక ముంబై పోలీసుల దమన నీతి ఎంత గొప్పగా ఉందోనని పొగడాలా? అసలింతకీ సుశాంత్ కేసును నిజాయితీగానే దర్యాప్తు చేస్తున్నారా? అన్న సందేహం ఇప్పుడు రాజుకుంటోంది. సుశాంత్ సింగ్ కుటుంబీకులు బీహార్ లో కేసులు నమోదు చేస్తున్నారు. సుశాంత్ ప్రియురాలిని బిజినెస్ లను సందేహిస్తూ తనపై కేసు పెట్టారు. తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కానీ దానికి ముంబై పోలీసులు సహకరించలేదనే సందేహాల్ని వ్యక్తం చేస్తున్నారు నెటిజనులు.
ఇక సుశాంత్ మాజీ ప్రియురాలు అయిన నటి అంకిత లోఖండేను విచారించడానికి వెళ్లిన బీహార్ పోలీసులకు ముంబైలో పరాభవం ఎదురైంది. ముంబై పోలీస్ సహకరించకపోవడంతో కాలి నడకన వెళ్లారు. ఆమెను తన నివాసంలో 3గంటల సేపు ప్రశ్నించారు. అటుపై తిరిగి తన సాయంతోనే అక్కడి నుంచి బయటపడ్డారు. అసలింతకీ సుశాంత్ కేసులో ఏం జరుగుతోంది? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్.