సుశాంత్ సింగ్ కేసు లో ఒక్కో నిజం షాకిస్తున్నాయి. డ్రగ్స్ విషయంలో రియా దే పాపం మొత్తం అంటూ సుశాంత్ మాజీ ప్రేయసి అంకిత లోఖండే వ్యాఖ్యానించారు. అలాగే కంగన కూడా ఆమెకు మద్ధతు పలికింది. తాజాగా అంకిత వర్సెస్ రియా వార్ హాట్ టాపిక్ గా మారింది.
సుశాంత్ సింగ్ కేసులో ఒక్కో మలుపు హీట్ పెంచుతున్నాయి. బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కొన్ని జాతీయ మీడియా ఛానెళ్లతో ఇంటర్వ్యూలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఇందులో రియా అమాయకత్వం బయటపడింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిరాశతో మరియు మాదకద్రవ్యాలు తీసుకునేవాడని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది రియా.
అయితే సుశాంత్ మాజీ ప్రియురాలు, అంకితా లోఖండే రియా వ్యాఖ్యలను ఖండించారు. ఫిబ్రవరి 2016 వరకు, సుశాంత్ ఎప్పుడూ నిరాశలో లేడు లేదా మానసిక వైద్యుడిని కలవనేలేదని అన్నారు. తాను సుశాంత్ కుటుంబంతో కలిసి సన్నిహితంగా ఉంటానని అంకిత తెలిపింది.
ఈ వ్యాఖ్యలు రియా కడుపు మంటకు కారణమయ్యాయి. దీంతో అంకితపై రుసరుసలాడస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. “అంకిత వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ సుశాంత్ వద్ద వితంతువులా నటిస్తోంది” అని రియా కోట్ చేసి, విడిపోయిన వెంటనే అంకిత సుశాంత్ స్నేహితుడితో సిగ్గు లేకుండా డేట్ కు వెళ్లిందని దెప్పి పొడిచింది. ఇక రియా చక్రవర్తినే స్వయంగా కాఫీలో మత్తు మందు కలిపి సుశాంత్ కి అలవాటు చేసిందన్న కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో రియాదే తప్పు అంటూ అంకిత సీరియస్ గానే వ్యాఖ్యానిస్తోంది.