Arthi Agarwal : ఆర్తీ అగర్వాల్.. అందానికీ, అభినయానికీ కేరాఫ్ అడ్రస్. ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. నిజంగానే అందరికీ నచ్చేసింది తొలి సినిమాతోనే. చాలా తక్కువ సినిమాలతోనే స్టార్‌డమ్ సంపాదించుకుంది. తెలుగులో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ తదితర స్టార్ హీరోలతో పాటు ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి యంగ్ హీరోలతోనూ స్ర్కీన్ షేర్ చేసుకుని సూపర్ డూపర్ హిట్స్అందుకుంది.
ఇంకా బోలెడంత బ్రైట్ ఫ్యూచర్ వున్న తరుణంలోనే అర్ధాంతరంగా తనువు చాలించింది. అప్పట్లో ఆర్తీ అగర్వాల్ మరణం ఓ సంచలనం. ఇప్పటికీ అది ఓ మిస్టరీనే. అసలెందుకు చనిపోయింది ఆర్తీ అగర్వాల్.? అధిక బరువు తగ్గించుకోవడానికి చేయించుకున్న ట్రీట్‌మెంట్ వికటించి ఆర్తీ అగర్వాల్ చచ్చిపోయిందంటూ తేల్చారు.
కానీ, అందులో నిజమెంత.? నిజంగానే ఆర్తీ అగర్వాల్ ట్రీట్‌మెంట్ వికటించిన కారణంగా చచ్చిపోయిందా.? ఏమో.. కానీ, ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం ఆర్తీ అగర్వాల్ చావుకు కారణం అనే ప్రచారంలో కొంత నిజం లేకపోలేదు. అదో ఎత్తయితే, ఇంట్లోని గొడవలు కూడా ఈ అందాల చందమామ చావుకు మరో కారణమనే ప్రచారం కూడా అప్పట్లో గుప్పుమంది.
ఒకసారి స్లీపింగ్ పిల్స్ తీసుకుని సూసైడ్ చేసుకోబోయింది ఆర్తీ అగర్వాల్. ఆ తర్వాత తండ్రితో గొడవల కారణంగానే మెట్ల మీది నుంచి కింద పడిపోయింది తలకు బలమైన గాయమైన కారణంగా ఆసుపత్రి పాలైంది. ఎలాగోలా కోలుకుంది. విపరీతంగా బరువు పెరిగింది. అయితే, ఇదంతా యాక్సిడెంటల్‌గా జరిగింది కాదన్న ప్రచారాన్నీ పూర్తిగా కొట్టి పాడేయడానికి లేదు.
ఇక ముచ్చటగా మూడోసారి ఆర్తీ అగర్వాల్ చచ్చిపోయిందన్న న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. నిజంగానే అధిక బరువు కారణంగా ఆర్తీ అగర్వాల్ చచ్చిపోయిందా.? ఏమో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పటికీ ఇది ఓ మిస్టరీనే. ఓ మంచి నటినీ, అందగత్తెనీ మాత్రం వెండితెర కోల్పోయింది. ఇది మాత్రం నిఖార్సయిన నిజం అంతే.!