సదరు యంగ్ హీరోయిన్ ఆ టాలీవుడ్ నిర్మాతతో సాగిస్తున్న ఎఫైర్ పై ఇప్పటికే ఎన్నో గుసగుసలు వినిపించాయి. సదరు బ్యూటీతో ఘాటైన ప్రేమాయణం ఆ నిర్మాత ఫ్యామిలీ లైఫ్ లోనూ చిచ్చు పెట్టిందని లేనిపోని టెన్షన్స్ తెచ్చి పెట్టిందని ప్రచారమైంది. ఇక ఆయన కోసం ఈ అమ్మడు ముంబై టు హైదరాబాద్ నిరంతర ప్రయాణాల గురించి చాలాసార్లు ఫిలింనగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి.
అసలు తనకు టాలీవుడ్ లో సరైన ఆఫర్లు లేకపోయినా ఇక్కడ రెగ్యులర్ హీరోయిన్ లా రెచ్చిపోతుంటుంది. అప్పుడప్పుడు అవార్డు ఫంక్షన్లలో డ్యాన్సులు చేస్తూ.. సినిమా ప్రమోషన్స్ లో సందడి చేస్తూ.. ప్రియుడు నిర్మించే సినిమాలతో అలా అలా ఇక్కడే ఆటాడేస్తుంటుంది. ఫిలింనగర్ లో ఆయన గారి ఆఫీస్ లోనూ ఈవిడ ఎక్కువ దర్శనమిస్తుంటుంది. ఇటీవలే ఆ నిర్మాత వరుస ఫ్లాపుల నుంచి బయటపడుతున్న వేళ.. సడెన్ గా కరోనా మహమ్మారీ తరుముకొచ్చింది.
దీంతో ఆయన గారి తదుపరి సినిమాలన్నీ పెండింగులో పడిపోయాయి. భారీగానే నష్టాలొచ్చేట్టు కనిపిస్తోంది సీన్ చూస్తుంటే.. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నాడట. ఇలాంటి టైమ్ లో ఈ లాక్ డౌన్ సమయంలో అతగాడి మూడ్ చెడకుండా ఆవిడగారు హైదరాబాద్ లోనే అతడిని ఖుషీ చేస్తోందట. ఇక స్వస్థలం ముంబైని మర్చిపోయి ఆయనగారి ఫామ్ హౌస్ లోనే సదరు హీరోయిన్ లాక్ అయిపోయిందట. దీంతో ఎడతెరిపి లేని నష్టాలు కష్టాలు ఉన్నా అవన్నీ మర్చిపోయి ఆ నిర్మాత జోష్ లోనే మునిగి తేల్తున్నాడట. అయితే ఆ నిర్మాత క్రెడిట్ కార్డుల్ని వాడేస్తూ అమ్మడు బాగానే జుర్రేస్తోందనేది మరో గుసగుస వినిపిస్తోంది. లాక్ డౌన్ లో ఆయనకు ఆవిడే లాకైందా లేక ఆవిడకు ఆయనే లాకయ్యాడా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.