సినిమాల్లోనే కాక రాజకీయాల్లోనూ తనదైన ముద్రను చూపిస్తున్నారు మోహన్ బాబు. దాంతో మీడియా అటెన్షన్ ఆయనపై ఉంటోంది. అదే సమంయలో రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అవి రూమర్స్ గా ఉంటే ఇబ్బంది లేదు. వాటి వల్ల కొత్త సమస్యలు రాకుండా ఉండేందుకు మోహన్ బాబు తన పీఆర్ టీమ్ తో కలిసి ఖండిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. మోహన్‌బాబు ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీ తరుపున ప్రచారంలోనూ పాల్గొన్న మోహన్ బాబు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయటంలో తన వంతు బాధ్యత నిర్వర్తించారు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాడ్డ దగ్గర నుంచి మోహన్‌బాబుకు కీలక పదవులు ఇస్తున్నారంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
కొద్ది రోజుల క్రితం మోహన్‌బాబును తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను మోహన్ బాబు ఖండించారు. తాజాగా మోహన్ బాబును ఎఫ్‌డీసీ (ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్) చైర్మన్‌గా నియమించారన్న ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్తలను మోహన్‌బాబు పీఆర్ టీం ఖండించారు.ఆ వార్తల్లో నిజం లేదన్న పీఆర్ టీం, ఏదైనా ఉంటే అధికారికంగా తెలియజేస్తాం అని వెల్లడించారు.